Viral: మామ మీద ఇష్టంతో.. సోనమ్‌ తరహాలోనే భర్తను చంపించిన మరో భార్య

 పెళ్లైన రెండు వారాలకే భర్తను హనీమూన్‌ పేరు చెప్పి షిల్లాంగ్‌ తీసుకెళ్లి చంపేసింది కదా సోనమ్‌.. ఇప్పుడలాంటి మర్డరే మరొకటి వెలుగుచూసింది. ఈసారి కథ బిహార్‌కి మారింది. ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ సోనమ్‌ కంటే ఖతర్నాక్. మామను పిచ్చిగా ప్రేమించింది. అతని కోసం భర్తను దారుణంగా మర్డర్ చేయించింది.

Viral: మామ మీద ఇష్టంతో.. సోనమ్‌ తరహాలోనే భర్తను చంపించిన మరో భార్య
Priyanu - Gunja Devi -Jeevan

Updated on: Jul 03, 2025 | 2:27 PM

తనకు వరసకు మామ అయ్యే వ్యక్తి నచ్చాడనే కారణంతో పెళ్లైన 45 రోజులకి భర్తను సుపారీ ఇచ్చి చంపేయించింది భార్య. ఔరంగాబాద్‌ జిల్లాలో జరిగింది ఈఘటన. 20 ఏళ్ల గుంజాదేవికి, పాతికేళ్ల ప్రియాంశుతో ఈ మధ్యే పెళ్లయ్యింది. ఐతే పెళ్లికి ముందే గుంజాదేవీ, ఆమె మామ జీవన్‌సింగ్‌తో ప్రేమలో ఉంది. అతని వయసు 55 ఏళ్లు. ఈ వయసు తేడా కారణంగా పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి జీవన్‌ను చేసుకుంది.  కానీ భర్తతో సంసారం ఇష్టం లేక, అటు మామను మర్చిపోలేక సుపారీ గ్యాంగ్‌తో డీల్‌ కుదుర్చుకుని భర్తను చంపించేసింది. గతనెల 25న ప్రియాంశు ఓ పనిమీద ఊరెళ్లాడు. నవీనగర్‌ రైల్వే స్టేషన్‌లో దిగి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. స్పాట్‌లోనే జీవన్ చనిపోయాడు.

విచారణలో ముందుగా ఎవరిపైనా అనుమానం లేదు. దోపిడీ దొంగల పనా అనే కోణంలోనే విచారణ మొదలుపెట్టారు.  మధ్యలో ఎందుకో పోలీసులకు దేవిపై అనుమానం వచ్చింది. ఆ యాంగిల్‌లో దర్యాప్తు చేస్తే.. మామ జీవన్‌తో గుంజాదేవి ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు కాల్‌రికార్డ్స్‌ ఆధారంగా తెలిసింది. ఇంతలో పోలీసులకు తనపై అనుమానం వచ్చిందని భావించిన దేవీ.. ఊళ్లోంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ టైమ్‌లో పోలీసులు ఎంటరై అరెస్టు చేశారు. ఇద్దరు సుపారీ గ్యాంగ్‌ సభ్యులనూ జైలుకు పంపారు. మామ జీవన్‌ పరారీలో ఉన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…