విద్యార్థుల పట్ల ఓ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీహార్‌కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భమ్రా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శానిటరీ ప్యాడ్స్‌తో పాటు కండోమ్స్ కూడా అడిగేలా ఉన్నారంటూ భమ్రా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆడబిడ్డల స్వశక్తే.. బీహార్ సమృద్ధి అనే వర్క్‌షాప్‌లో మహిళా, శిశు అభివృద్ధి కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భమ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. రూ. 20 నుంచి రూ. 30 మధ్య ధరకు రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్‌ను ఇవ్వగలదా? అని ఆ విద్యార్థిని ఎంతో సరళంగా ప్రశ్నించింది. విద్యార్థిని ప్రశ్నతో హర్జోత్ కౌర్ ఆవేశంతో ఊగిపోయారు. రేపు జీన్స్‌లను కూడా ఇవ్వమని అడగండి.. ఆ తర్వాత అందమైన షూ కూడా ఇవ్వాలని అడగండని విద్యార్థినులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగలేదు సదరు ఐఏఎస్ అధికారిని…మరింత ఆగ్రహంతో.. ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, కండోమ్స్‌ను కూడా ప్రభుత్వం నుంచి ఆశించేలా ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సదరు ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ భమ్రా. అనంతరం మరో విద్యార్థిని స్పందిస్తూ.. ప్రజల ఓటుతో ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల కోసం పనిచేయడమే తమ కర్తవ్యమని ఆ అధికారికి గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఆమె మండిపడ్డారు. ఇది మీ మూర్ఖత్వపు పని. ఓటు వేయకండి.. ఆ తర్వాత పాకిస్తాన్‌గా మార్చేయండి.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు డబ్బుకే ఓటు వేస్తారా..? అంటూ సదరు ఆఫీసర్ విద్యార్థినిని ప్రశ్నించింది. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. మా పాఠశాలలో టాయిలెట్లను ధ్వంసం చేశారు. బాలికల టాయిలెట్లలోకి బాలురు తరుచుగా ప్రవేశిస్తున్నారు. ఈ మాటలకు ఆఫీసర్ స్పందిస్తూ.. మీ ఇండ్లలో మీకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై మీరే సమాధానం చెప్పాలని విద్యార్థులను ఆమె అడిగారు. కొన్ని విషయాలను మీరు అడగొద్దని సూచించారు.
సదరు మహిళా ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ భమ్రా.. యునిసెఫ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి సంస్థ, సశక్త్ బేటి, సమృద్ధి బీహార్ కార్యక్రమానికి ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ భమ్రా చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.
The video of that insensitive and unempathetic IAS officer pic.twitter.com/lg5mNEvVVO
— Rituraj (@KnottyMedic) September 28, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..