SBI ATM: మహానుభావుడు! ఏకంగా ఏటీఎంలోనే మద్యం దుకాణం పెట్టాడు.. పోలీసుల ఎంట్రీతో..

|

Aug 10, 2022 | 1:21 PM

ఏటీఎంలోపల ఏసీ ఉండటం వల్ల కొందరు ఎండ తాపానికి తట్టుకోలేక కాసేపు కనుకుతీస్తే.. మరికొందరు తమ చేతివాటం చూపి ఏటీఎంలను కొల్లగొట్టిన సంఘటనలు కోకొల్లలు. ఐతే వీరందరికీ అతీతంగా ఓ ప్రబుద్ధుడు కాపలాగా ఉంచిన గార్డుతో చేతులు కలిపి ఏకంగా..

SBI ATM: మహానుభావుడు! ఏకంగా ఏటీఎంలోనే మద్యం దుకాణం పెట్టాడు.. పోలీసుల ఎంట్రీతో..
Liquor From Atm
Follow us on

Liquor Selling from SBI ATM: సిటీ, విలేజ్‌ అనే తేడా లేకుండా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఏటీఎంలను ఏర్పాటు చేస్తే.. కొందరు దుర్భుద్ధితో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలోపల ఏసీ ఉండటం వల్ల కొందరు ఎండ తాపానికి తట్టుకోలేక కాసేపు కనుకుతీస్తే.. మరికొందరు తమ చేతివాటం చూపి ఏటీఎంలను కొల్లగొట్టిన సంఘటనలు కోకొల్లలు. ఐతే వీరందరికీ అతీతంగా ఓ ప్రబుద్ధుడు కాపలాగా ఉంచిన గార్డుతో చేతులు కలిపి ఏకంగా ఏటీఎం లోపలే మద్యం దుఖాణం తెరిచాడు. ఈ షాకింగ్‌ సంఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గార్డు సాయంతో ఏటీఎంలో మద్యం ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ముజఫర్‌పూర్‌ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు ఏటీఎంపై దాడి చేసి భారీ మొత్తంలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గార్డుతో పాటు మద్యం వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం (ఆగస్టు 8) కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ జైలుకు తరలించారు. మద్యం విక్రయిస్తున్న ఏటీఎం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినది. ఈ సందర్భంగా నగర డీఎస్పీ రామ్ నరేష్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ.. గార్డు సాయంతో ఏటీఎంలో మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఏటీఎంలో సోదా చేయగా అందులో ఉంచిన విదేశీ మద్యం దొరికింది. ఘటనా స్థలం నుంచి ఏటీఎం గార్డు, మద్యం వ్యాపారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఎస్బీఐ ఏటీఎం నుంచి మద్యం విక్రయిస్తున్నట్లు బయటికి పొక్కడంతో స్థానికంగా కలకలం రేగింది.