‘సుపరిపాలన, సామాజిక న్యాయం గెలిచింది.. అఖండ తీర్పు ప్రజాసేవకే అంకితం’: ప్రధాని మోదీ

వివిధ రంగాలలో మరింత గొప్ప పురోగతిని సాధిస్తామని బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రాబోయే సంవత్సరాల్లో, బీహార్‌ను అభివృద్ధి చేయడానికి, దాని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, రాష్ట్ర సంస్కృతికి కొత్త గుర్తింపును ఇవ్వడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాము. బీహార్ యువత, మహిళలు సంపన్నమైన జీవితానికి పుష్కలమైన అవకాశాలు ఉండేలా చూస్తాము" అని ఆయన అన్నారు.

సుపరిపాలన, సామాజిక న్యాయం గెలిచింది.. అఖండ తీర్పు ప్రజాసేవకే అంకితం: ప్రధాని మోదీ
Pm Modi, Nitish Kumar

Updated on: Nov 14, 2025 | 5:45 PM

బీహార్‌లో బీజేపీ అఖండ విజయంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి స్పందన వచ్చింది. ఇది అభివృద్ధి, సుపరిపాలనకు లభించిన విజయం అని ప్రధాని మోదీ అన్నారు. “ఇది సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమ స్ఫూర్తికి లభించిన విజయం. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు చారిత్రాత్మక, అపూర్వమైన విజయంతో ఆశీర్వదించిన బీహార్‌లోని కుటుంబ సభ్యులకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అఖండ తీర్పు ప్రజలకు సేవ చేయడానికి, బీహార్ కోసం నూతన సంకల్పంతో పనిచేయడానికి మాకు శక్తినిస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రధానమంత్రి మోదీ అన్ని ఎన్డీఏ పార్టీలకు అభినందనలు తెలిపారు. “ఎన్డీఏ రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధిని తీసుకొచ్చింది. మా ట్రాక్ రికార్డ్‌ను, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే మా దార్శనికతను గుర్తించి ప్రజలు మాకు భారీ మెజారిటీ ఇచ్చారు. ఈ అఖండ విజయం కోసం ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మా ఎన్డీఏ కుటుంబ మిత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని ఆయన అన్నారు.

బీహార్ ప్రజలు అభివృద్ధి ఎజెండాను దృష్టిలో ఉంచుకుని ఓటు వేశారని ప్రధానమంత్రి మోదీ అన్నారు. “అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఎన్డీఏ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు మన అభివృద్ధి ఎజెండాను ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చారు. ప్రతిపక్షాల ప్రతి అబద్ధాన్ని తీవ్రంగా తిప్పికొట్టారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.

వివిధ రంగాలలో మరింత గొప్ప పురోగతిని సాధిస్తామని బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రాబోయే సంవత్సరాల్లో, బీహార్‌ను అభివృద్ధి చేయడానికి, దాని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, రాష్ట్ర సంస్కృతికి కొత్త గుర్తింపును ఇవ్వడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాము. బీహార్ యువత, మహిళలు సంపన్నమైన జీవితానికి పుష్కలమైన అవకాశాలు ఉండేలా చూస్తాము” అని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, ప్రస్తుత బీహార్ ఎన్నికల ట్రెండ్స్‌లో, NDA కూటమి 202 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. విజయ గణాంకాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు 91 స్థానాలతో BJP అతిపెద్ద పార్టీగా అవతరిస్తున్నట్లు కనిపిస్తోంది. JDU-83 సీట్లు, LJP(R)-19, HAM – 5, RLM – 4 సీట్లు గెలుచుకుంటాయని అంచనా.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..