రూ.400 కోట్ల దోపిడీ కేసులో సంచలన ట్విస్ట్.. కర్నాటక పోలీసుల స్టేట్‌మెంట్‌తో ఉత్కంఠ..!

బాబోయ్‌ మామూలు ట్విస్టులు కాదు...! మిస్టరీ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా..! పొలిటికల్‌ టచ్‌ ఇస్తూ నడుస్తున్న రూ. 400 కోట్ల పాతనోట్ల దోపిడి కేసు రోజుకో టర్న్ తీసుకుంటూ మిస్టరీగా మారింది..! ఆ డబ్బు ఎక్కడిది..? ఎవరిది..? పొలిటికల్‌ సపోర్ట్‌ ఇచ్చేదెవరు..? అన్న అంశాలపై రకరకాల వాదనలు వినిపిస్తుండగా కర్ణాటక, మహారాష్ట్ర పోలీసుల భిన్న వాదనలు కేసును ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మార్చాయి.

రూ.400 కోట్ల దోపిడీ కేసులో సంచలన ట్విస్ట్.. కర్నాటక పోలీసుల స్టేట్‌మెంట్‌తో ఉత్కంఠ..!
Biggest Robbery

Updated on: Jan 27, 2026 | 1:50 PM

గత సంవత్సరం అక్టోబర్ 22న దట్టమైన అడవులు, లోయలు, నిర్జన రహదారులతో కూడిన చోర్లా ఘాట్ వద్ద ఈ దోపిడీ జరిగింది. గోవా నుండి కర్ణాటక మీదుగా మహారాష్ట్రకు ప్రయాణిస్తున్న రెండు పెద్ద కంటైనర్లను ప్రణాళికాబద్ధంగా హైజాక్ చేసినట్లు సమాచారం. గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా తిరుపతి వైపు నోట్ల కట్టలతో వెళ్తున్న రెండు కంటెయినర్లు కర్ణాటకలో దారిదోపిడీకి గురయ్యాయన్న ఫిర్యాదు కలకలం రేపింది. అతను దోపిడీని వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది పరిస్థితిని మరింత తీవ్ర దుమారం రేపింది.

కేసు ముదిరిపోవడంతో, వ్యాపారవేత్త కిషోర్ సేథ్, నిందితుడు జయేష్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ అయింది. ఈ విషయం తీవ్రత దృష్ట్యా, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక SIT ని ఏర్పాటు చేసింది. ఆ డబ్బు ఎవరో దోచేశారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అలాంటి ఘటన జరిగినట్లు తమ దృష్టిలోనే లేదని కర్ణాటక చెబుతుండటం షాక్‌కు గురిచేస్తోంది. ఇలా ఇరు రాష్ట్రాల పోలీసులు భిన్నమైన ప్రకటనలు చేస్తుండగా… డబ్బును కేరళ, పశ్చిమబెంగాల్, అసోం ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్నట్లు కాంగ్రెస్, బీజేపీ పరస్పరం నిందించుకోవడం రాజకీయంగానూ వేడి రాజేసింది.

అయితే, మహారాష్ట్రలోని నాసిక్‌లో గతేడాది డిసెంబరు 17న సందీప్‌ దత్త పాటిల్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అక్టోబర్‌ 22న 400 కోట్ల రూపాయలతో వెళ్తున్న రెండు కంటెయినర్లు దోపిడీకి గురయ్యాయన్నాడు. వారి నుంచి తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి, తీవ్రత దృష్ట్యా సిట్‌ ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్న సిట్.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తోంది. అయితే మహారాష్ట్ర పోలీసులు అలా అంటుంటే.. ఇప్పటిదాకా తమ దృష్టికి రాలేదని బెళగావి పోలీసులు చెబుతుండటం అవాక్కయ్యేలా చేస్తోంది. ఇటు కర్నాటక హోమ్ మినిస్టర్ జి.పరమేశ్వర కూడా ఇష్యూపై స్పందించారు. తమ దగ్గర ఆధారాల్లేవని, మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులో ఏం జరుగుతుందో చూద్దామన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..