బిగ్ బ్రేకింగ్.. పీవోకేలో భారీ కాల్పులు.. ఉగ్రవాద శిక్షణా శిభిరాల ధ్వంసం..!

| Edited By:

Dec 21, 2019 | 6:16 AM

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది ఇండియన్ ఆర్మీ. పీవోకేలోని నీలం వ్యాలీలో భారీ కాల్పులు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా నీలం లోయను.. జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్రసంస్థలు అడ్డాగా మార్చుకున్నాయి. దీంతో ఉగ్ర సంస్థల శిక్షణా శిభిరాలను నేలమట్టం చేసేందుకు భారత ఆర్మీ కదం తొక్కింది. ఈ క్రమంలోనే నీలం వ్యాలీలో ఉగ్ర శిక్షణా శిభారలను ధ్వంసం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సరిహద్దుల వైపు ఆర్మీ ట్రక్కులు, ట్యాంకులను ఆర్మీ అధికారులు.. అంబాల […]

బిగ్ బ్రేకింగ్.. పీవోకేలో భారీ కాల్పులు.. ఉగ్రవాద శిక్షణా శిభిరాల ధ్వంసం..!
Follow us on

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది ఇండియన్ ఆర్మీ. పీవోకేలోని నీలం వ్యాలీలో భారీ కాల్పులు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా నీలం లోయను.. జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్రసంస్థలు అడ్డాగా మార్చుకున్నాయి. దీంతో ఉగ్ర సంస్థల శిక్షణా శిభిరాలను నేలమట్టం చేసేందుకు భారత ఆర్మీ కదం తొక్కింది. ఈ క్రమంలోనే నీలం వ్యాలీలో ఉగ్ర శిక్షణా శిభారలను ధ్వంసం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సరిహద్దుల వైపు ఆర్మీ ట్రక్కులు, ట్యాంకులను ఆర్మీ అధికారులు.. అంబాల కంటోన్మెంట్ నుంచి ప్రత్యేక రైళ్లలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, గత రెండు రోజుల క్రితమే భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని.. అందరూ అలర్ట్‌గా ఉండాలంటూ పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద ఉగ్రవాదులు పొంచిఉన్నారని.. పాక్ ఆర్మీ కూడా తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడుస్తూ.. కయ్యానికి కాలుదువ్వుతుందంటూ చెప్పారు. ఈ క్రమంలోనే నీలం వ్యాలీలో భారీ కాల్పులు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనను ఆర్మీ చేయలేదు.  దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.