త్వరగా వెళ్లి తమ్ముడికి రాఖీ కట్టాలనుకుంది.. కట్‌చేస్తే.. బాత్‌రూమ్‌లో శవమై కనిపించింది.. అసలు ఏం జరిగింది!

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రాక్షా బంధన్‌ పండుగ పూట తీవ్ర విషాదం వెలుగుచూసింది. తమ్ముడికి రాఖీ కట్టడానికి ఇంటికి వెళ్లేందుకు త్వరగా డ్యూటీ ముగించుకొని వెల్దామనుకున్న ఒక నర్స్‌.. తను పనిచేస్తున్న హాస్పిటల్‌ బాత్‌రూమ్‌లో అనుమానాస్పదంగా చనిపోయి కనిపించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మరణానికి గల కారణాలను తేల్చే పనిలో పడ్డారు.

త్వరగా వెళ్లి తమ్ముడికి రాఖీ కట్టాలనుకుంది.. కట్‌చేస్తే.. బాత్‌రూమ్‌లో శవమై కనిపించింది.. అసలు ఏం జరిగింది!
Woman Dead In Accident

Updated on: Aug 09, 2025 | 9:30 PM

తమ్ముడికి రాఖీ కట్టడానికి ఇంటికి వెళ్లాలని త్వరగా డ్యూటీ పూర్తి చేసుకున్ను ఒక నర్స్‌ హాస్పిటల్‌ బాత్‌రూమ్‌లో శవమై కనిపించిన ఘనట ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తున్న ఒక మహిళా శనివారం రక్షా బంధన్‌ సందర్భంగా ఇంటికి వెళ్లాలనుకుంది. ఇందు కోసం పర్మిషన్‌ కూడా తీసుకుంది. ఇందులో భాగంగానే తర్వాత డ్యూటీ పూర్తి చేసుకొని గంజాం జిల్లాలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఇంటికి వెళ్లాల్సిన సదరు మహిళ కాసేపటి తర్వాత తను పనిచేస్తున్న హాస్పిటల్‌ బాత్‌రూమ్‌లో శవం అయి కనిపించింది.

బాత్‌రూమ్‌లో మహిళ మృతదేమాన్ని గుర్తించిన హాస్పిటల్‌ సిబ్బంది. మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తమకు రెండు గంటలు ఆలస్యంగా హాస్పిటల్‌ యాజమాన్యం సమాచారం ఇచ్చినట్లు ఆరోపించారు. వాళ్లు మొదట ఆమె బాత్‌రూమ్‌లో స్ప్రహ తప్పి పడిపోయినట్టు తెలిపారని.. మళ్లీ కొద్ది సేపటి తర్వాత ఆమె చేతిలో సిరంజిని గుర్తించామని.. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారని యువతి సోదరుడు చెప్పాడు.

మరోవైపు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాత్‌రూమ్‌లో పడిఉన్న మహిళ మృతదేమాన్ని పరిశీలించారు. ఆమె చేతిలో సిరంజి, చేతి వెనుక భాగంలో సూది ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సూదితో ఇంజెక్ట్ చేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్పిటల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.