
మహారాష్ట్రలోని భివాండీ సిటీలో భవనం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 39 కి పెరిగింది. 36 ఏళ్ళ కింద నిర్మించిన ఈ ‘జిలానీ’ బిల్డింగ్ లో 48 ఫ్లాట్లు ఉండగా, వీటిలో 24 ఫ్లాట్లు కుప్పకూలిపోయాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, పోలీసులు సంయుక్తంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. సుమారు 30 గంటలుగా వారు శ్రమిస్తున్నారు. శిథిలాలనుంచి ఇప్పటివరకు 25 మందిని రక్షించారు. మరికొంతమంది వీటి కింద చిక్కుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. పరారీలో ఉన్న ఈ భవనయజమాని సయ్యద్ జిలానీ పై పోలీసులు కేసు పెట్టారు.