Bharat Biotech Covaxin: బ్రెజిల్​కు కొవాగ్జిన్ సరఫరా చేయనున్న భారత్ బయోటెక్.. కుదిరిన ఒప్పందం

|

Jan 12, 2021 | 8:52 PM

భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ 'కొవాగ్జిన్​'ను ఆ సంస్థ బ్రెజిల్​కు సరఫరా చేయనుంది. ఇందుకోసం భారత్​ బయోటెక్​తో బ్రెజిల్​కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్....

Bharat Biotech Covaxin: బ్రెజిల్​కు కొవాగ్జిన్ సరఫరా చేయనున్న భారత్ బయోటెక్.. కుదిరిన ఒప్పందం
Follow us on

Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్​’ను ఆ సంస్థ బ్రెజిల్​కు సరఫరా చేయనుంది. ఇందుకోసం భారత్​ బయోటెక్​తో బ్రెజిల్​కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్​ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కొవాగ్జిన్ ఎగుమతి అవకాశాలపై చర్చించేందుకు హైదరాబాద్​లోని భారత్​ బయోటెక్ సెంటర్‌‌ను ప్రెసిసా మెడికామెంటోస్ టీమ్ ఇటీవల సందర్శించింది.

ఇందులో భాగంగా జనవరి 7,8 తేదీల్లో భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లాతో ఆ టీమ్ కీలక చర్చలు జరిపింది. భారత్​లో బ్రెజిల్ రాయబారి ఆండ్రే అరన్హా​ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీలోనే బ్రెజిల్ తరఫున కొవాగ్జిన్​ను దిగుమతి చేసుకునేందుకు ఆయన ఇంట్రస్ట్ చూపించారు. తుది దశ చర్చలు ముగిసిన నేపథ్యంలో తాజాగా బ్రెజిల్​కు కొవాక్సిన్ సరఫరా చేయనున్నట్లు భారత్ బయోటెక్ అఫిషియల్ అనౌన్సిమెంట్ చేసింది.

Also Read:

మా వ్యాక్సిన్ దేశంలో పలు నగరాలకు చేరింది, సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా హర్షం, ఇదే కృషి సాగిస్తామని ప్రకటన

Vaccination‌ Process: వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గురించి వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి