మా వ్యాక్సిన్ దేశంలో పలు నగరాలకు చేరింది, సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా హర్షం, ఇదే కృషి సాగిస్తామని ప్రకటన

తమ వ్యాక్సిన్ కోవిషీల్డ్ మంగళవారం  దేశంలోని వివిధ నగరాలకు చేరిందని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. ఇందుకు ఎంతో సంతోషంగా..

  • Umakanth Rao
  • Publish Date - 6:15 pm, Tue, 12 January 21

తమ వ్యాక్సిన్ కోవిషీల్డ్ మంగళవారం  దేశంలోని వివిధ నగరాలకు చేరిందని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. ఇందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొత్తం 56. 5 లక్షల డోసులు ఈ ఉదయం బయటకు వెళ్లాయని ఆయన చెప్పారు. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, లక్నో, కోల్ కతా, పాట్నా, గౌహతి వంటి నగరాలకు చేరినట్టు పూనావాలా చెప్పారు. తమ సంస్థకు చెందిన  ఓ టీమ్ తోను, తమ వ్యాక్సిన్ బాక్సులతో కూడిన ట్రక్కు ముందు కూర్చుని ఓ ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మూడు ట్రక్కులు వివిధ నగరాలకు తరలాయి. ఏప్రిల్ నాటికి 5.60 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం  యోచిస్తోంది. మొదటి 100 మిలియన్ డోసులకు 200 రూపాయలు స్పెషల్ ప్రయిజ్ చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. ఆ తరువాత ప్రైవేటు మార్కెట్ లో ఇది డోసుకు వెయ్యి రూపాయలవుతుందని పూనావాలా పేర్కొన్నారు.