పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సోదరుడు సంచలన వ్యాఖ్యలు.. వారసత్వ రాజకీయాలపై ఆయన ఏం చెప్పారంటే..

|

Jan 15, 2021 | 7:50 AM

Bengal Politics: వారసత్వ రాజకీయాలపై పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సోదరుడు కార్తీక్‌ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సోదరుడు సంచలన వ్యాఖ్యలు.. వారసత్వ రాజకీయాలపై ఆయన ఏం చెప్పారంటే..
Follow us on

Bengal Politics: వారసత్వ రాజకీయాలపై పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సోదరుడు కార్తీక్‌ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పనిచేసే రాజకీయ నాయకుల పట్ల విసుగొచ్చేసిందని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నట్లు విరివిగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పష్టతనివ్వడం లేదు.

తృణముల్ కాంగ్రెస్, బీజేపీల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో పుంజుకున్న భాజపా, స్థానికంగా అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోందని జోస్యం చెప్పారు. భాజపా జాతీయ నాయకులు వరుసగా అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ మధ్యే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారని కొనియాడారు. సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించగా.. మొదట ప్రజల గురించి తర్వాతే కుటుంబం గురించి ఆలోచించాలి అని కార్తీక్‌ బెనర్జీ అన్నారు. భాజపాలో చేరే అవకాశాన్ని ఆయన కొట్టి పారేయలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదన్నారు.

జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ చూపు.. బీజేపీతో ఇక ఢీ అంటే ఢీ.. డిసెంబర్‌లో కీలక భేటీ