బెంగళూరు, ఏప్రిల్ 12: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబ్ పేలుళ్లకు సంబంధించి ప్రధాన సూత్రదారిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పశ్చిమ బెంగాల్‌లో అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న నిందితులను కోల్‌కతాలోని వారి రహస్య స్థావరం నుంచి పట్టుకున్నారు. నిందితుడు కేఫ్‌లో ముస్సావీర్ హుస్సెన్ షాజిద్ ఐఈడీ బాంబ్‌ను అమర్చాడు. కేఫ్ బాంబ్ పేలుళ్ల వెనుక మాస్టర్‌మైండ్, అమలులో అబ్దుల్ మదీన్ తాహ ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. వీరిద్దరూ 2020నాటి టెర్రరిజం కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్నారు. ఐఎస్‌ఐఎస్, అల్ హింద్ ఉగ్రమూకతో అబ్దుల్ మదీన్‌కు సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఏస్ పేర్కొంది. అయితే వీరు నకిళీ గుర్తింపుతో ఇన్నాళ్లు దక్కున్నట్లు ఎన్‌ఐఏ చెబుతోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన కేంద్ర నిఘా సంస్థలు, పోలీసుల మధ్య జరిగిన సమన్వయ చర్యలో నిందితులను పట్టుకున్నట్లు NIA ఒక ప్రకటనలో తెలిపింది. షాజిబ్, తాహా ఇద్దరూ విదేశీ హ్యాండ్లర్ నుంచి నిరంతరం సూచనలను స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఈ అరెస్టులతో కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో విస్తరించిన స్లీపర్ సెల్ మాడ్యూల్‌ను బహిర్గతం చేసే అవకాశం ఉంది.
పేలుడు తర్వాత షాజీబ్ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులో గోరగుంటెపాళ్యకు వెళ్లాడు. అక్కడి నుంచి స్టేషన్ బస్సులో తుమకూరు వెళ్లాడు. నిందితులు బస్సులు మారుస్తూ బళ్లారి మీదుగా కలబురగికి వెళ్లాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు చేరుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి షాజిబ్ ఒడిశా మీదుగా కోల్‌కతా చేరుకున్నాడు. మరోవైపు అబ్దుల్ మతీన్ తాహా కూడా వేరే మార్గంలో తమిళనాడు మీదుగా కోల్‌కతా వెళ్లాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ కోల్‌కతాలో కలుసుకున్నారు. వీరిద్దరూ కోల్‌కతా వదిలి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది మార్చి 29న ఉగ్రవాద నిరోధక సంస్థ ఇద్దరు నిందితుల ఫొటోలు, వివరాలను విడుదల చేసింది. వీరి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. షాజిబ్ తన పేరును ‘మహమ్మద్ జునేద్ సయ్యద్’గా మార్చుకోగా.. తాహా హిందూ నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి విఘ్నేష్ పేరుతో నకిలీ ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. వీరికి లాజిస్టిక్స్ అందించిన నిందితుడు చిక్కమగళూరు నివాసి ముజమ్మిల్ షరీఫ్‌ను గత నెలలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.
కాగా బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ కేఫ్‌లో ఐఈడీ పేలుడు ధాటికి 10 మంది గాయపడ్డారు. ఫుల్ స్లీవ్ షర్ట్, క్యాప్, కళ్లద్దాలు, ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ప్రధాన నిందితుడిని మార్చి 1 ఓ సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. అతను పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లినట్లు భావిస్తున్న బ్యాగ్‌తో కేఫ్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. కేఫ్‌లో నిందితుడు రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కేఫ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. అయితే తాను ఆర్డర్ చేసిన మీల్స్ తినకుండా కేఫ్ నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన నిమిషాల వ్యవధిలోనే పేలుడు సంభవించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.