Bengaluru stampede: బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌పై వేటు.. RCBపై కేసు..

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బాద్యులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం సిద్ధరామయ్య డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు పడింది. కబ్బన్‌ పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, స్టేషన్‌ హౌస్‌ మాస్టర్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ఏసీపీ, సెంట్రల్‌ డివిజన్‌ డీసీపీ, క్రికెట్‌ స్టేడియం ఇన్‌ఛార్జి, అదనపు పోలీస్‌ కమిషనర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సస్పెండ్ అయ్యారు.

Bengaluru stampede: బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌పై వేటు.. RCBపై కేసు..
Bengaluru Stampede

Updated on: Jun 05, 2025 | 10:19 PM

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్నాటక సర్కార్ సీరియస్ అయింది. సిటీ పోలీస్ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.
సీపీతోపాటు అడిషనల్ సీపీ, డీసీపీ, ఏసీపీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కబ్బన్‌ పార్క్‌ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌‌పై కూడా వేటు వేసింది.

ఈ సంఘటనపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 30 రోజుల్లో కమిషన్ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించారు. కాగా ఈ తొక్కసలాట కేసులో ఏ1గా ఆర్సీబీ, ఏ2గా DNA మేనేజ్‌మెంట్, ఏ3గా కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను పేర్కొంది. సత్కార కార్యక్రమానికి సిద్ధం కావడానికి మరికొన్ని రోజులు సమయం ఇవ్వాలన్న పోలీసుల సలహాను ఆర్‌సిబి విస్మరించినట్లు తెలుస్తోంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు.

18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్‌సిబి తొలిసారిగా ఐపిఎల్ టైటిల్ కొట్టడంతో రాష్ట్రంలో ఎమెషన్స్‌ పీక్స్‌కు చేరాయి. బుధవారం సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జట్టుకు జరిగిన సన్మాన కార్యక్రమానికి ఫ్యాన్స్ పోటెత్తారు. స్టేడియంలోకి ప్రవేశించడానికి అభిమానులు దూసుకుపోవడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 47 మంది గాయపడ్డారు.