పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న రాజకీయ వలసలు.. బీజేపీలో చేరిన బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ

|

Mar 01, 2021 | 8:22 PM

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల హీటెక్కుతున్నాయి. పోటా పోటీ ప్రచారాలు.. నేతల చేరికలతో.. మరింత రసవత్తరంగా మారుతున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న రాజకీయ వలసలు.. బీజేపీలో చేరిన బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ
Follow us on

West Bengal politics : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల హీటెక్కుతున్నాయి. పోటా పోటీ ప్రచారాలు.. నేతల చేరికలతో.. మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికారి పార్టీ టీఎంసీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. మరోవైపు సెలబ్రేటీలు సైతం పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. బుధవారం ఒకే రోజు ఇద్దరు క్రికెటర్లు రాజకీయ అరంగ్రేటం చేయగా, తాజాగా సీని నటి స్రబంతి కూడా కషాయం కండువా కప్పుకున్నారు.

బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ పరిశీలకుడు కైలాష్ విజయవర్గీయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, బీజేపీ కో-ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ సమక్షంలో ఆమె సోమవారంనాడు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. 1997లో ‘మయర్ బధోన్’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన చటర్జీ ఆ తరువాత ‘ఛాంపియన్’, ‘అమానుష్’, ‘కనమచి’, ‘జియా పగ్లా’, ‘ఛోబియల్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నటి పార్టీలో చేరడంపట్ల బెంగాల్ భారతీయ జనతా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే, గత నెలలో ప్రముఖ బెంగాలీ నటుడు యష్ దాస్‌గుప్తా కూడా బీజేపీలో చేరారు. వ్యవస్థలో మార్పు తీసుకు రావాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలని, బీజేపీ ఎప్పుడూ యువతను ప్రోత్సహిస్తూ వస్తోందని చెప్పారు. కాగా, 8 విడతలు జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27న మొదలై ఏప్రిల్ 29తో ముగుస్తాయి. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.

Read Also…  కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న ముసలం.. బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో పొత్తును తప్పబట్టిన కాంగ్రెస్ నేత అనంద్‌శర్మ