దారుణం.. స్కూల్‌కి సెలవు కోసం.. ఒకటవ తరగతి విద్యార్థిని చెరువులో ముంచి..

|

Feb 08, 2024 | 8:23 AM

బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాలుడి తలపై కొట్టిన గాయాలున్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలిసింది. దాంతో బాలుడిని ఎవరో చంపేసి, చెరువులో పడవేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బాలుడు అదృశ్యమైనప్పటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థి పాఠశాలకు రావటం లేదని పోలీసులు గుర్తించారు.

దారుణం.. స్కూల్‌కి సెలవు కోసం.. ఒకటవ తరగతి విద్యార్థిని చెరువులో ముంచి..
West Bengal Shocker
Follow us on

పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌ నుంచి తప్పిపోయిన ఒకటో తరగతి విద్యార్థి రెండు రోజుల తర్వాత అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు. అదృశ్యమైన బాలుడి మృతదేహాన్ని పాఠశాల సమీపంలోని చెరువులో గుర్తించారు.. చిన్నారి ఆచూకీ కనిపించకపోవటంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పాఠశాలకు 400 మీటర్ల దూరంలో ఉన్న చెరువు నుండి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడు చెరువులో మునిగిపోయి ఉంటాడని తొలుత అనుమానం వ్యక్తం చేశారు. అయితే విచారణలో చిన్నారిని అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి హత్య చేసి చెరువులో పడేసినట్లు షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాలుడి తలపై కొట్టిన గాయాలున్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలిసింది. దాంతో బాలుడిని ఎవరో చంపేసి, చెరువులో పడవేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బాలుడు అదృశ్యమైనప్పటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థి పాఠశాలకు రావటం లేదని పోలీసులు గుర్తించారు. దాంతో అతనిపై అనుమానం వ్యక్తం చేశారు.. ఎనిమిదో తరగతి విద్యార్థిని విచారించగా, బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. అందుకు అతడు చెప్పిన కారణం తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు.

స్కూల్‌కి సెలవు కావాలనే నెపంతోనే ఒకటో తరగతి విద్యార్థిని హత్య చేసినట్టుగా అంగీకరించాడు. స్కూల్‌లో ఎవరైనా విద్యార్థి చనిపోతే స్కూల్‌కి సెలవు ప్రకటిస్తారని భావించినట్లు నిందితుడు విద్యార్థి వెల్లడించాడు. పాఠశాలకు సెలవు ప్రకటించిన తర్వాత, అతను హాస్టల్ నుండి తన ఇంటికి వెళ్లాలనుకున్నాడు. దీంతో బాలుడిని హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసినట్టుగా పోలీసుల విచారణలో నిందితుడైన ఎనిమిదో తరగతి విద్యార్థి అంగీకరించినట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..