Pamela Goswami BJP: కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు, నేరం ‘ఆయనదే’, బెంగాల్ బీజేపీ యువ మోర్చా నేత పమేలా గోస్వామి

| Edited By: Ram Naramaneni

Feb 21, 2021 | 11:51 AM

కోల్ కతా లో 100 గ్రాముల నిషిద్ధ కొకైన్ తీసుకువెళ్తూ పోలీసులకు పట్టుబడిన బీజేపీ యువ మోర్చా నేత పమేలా గోస్వామి ఇందులో తన నేరం లేదని చెబుతోంది..

Pamela Goswami BJP: కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు, నేరం ఆయనదే, బెంగాల్ బీజేపీ యువ మోర్చా నేత పమేలా గోస్వామి
Follow us on

Pamela Goswami BJP: కోల్ కతా లో 100 గ్రాముల నిషిద్ధ కొకైన్ తీసుకువెళ్తూ పోలీసులకు పట్టుబడిన బీజేపీ యువ మోర్చా నేత పమేలా గోస్వామి ఇందులో తన నేరం లేదని చెబుతోంది. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని అంటోంది. పోలీసులు ఆమెను కోర్టుకు తీసుకువెళ్తుండగా.. తమ పార్టీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ సహచరుడు రాకేష్ సింగ్ కి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. ఆయన తనపై కుట్ర చేశాడని, తన పర్సులో ఈ డ్రగ్ ను ఉంచాలంటూ ఓ వ్యక్తిని పంపాడని ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారంపై సీఐడీ చేత దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేసింది. బెంగాల్ లో కైలాష్ విజయ్ వర్గీయ బీజేపీ ఇన్-ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. కాగా… రాకేష్ సింగ్ ని అరెస్టు చేయాలనీ, నన్ను కేసులో ఇరికించాలన్నదే అతని  అభిమతమని పమేలా దుయ్యబట్టింది. కానీ కోర్టులో మాత్రం ఆమె ఈ ఆరోపణలు చేయలేదు.

పమేలా గోస్వామికి ఈ నెల 25 వరకు పోలీసు రిమాండ్ విధించారు. తన ఫ్రెండ్, కొల్లీగ్ ప్రబీర్ కుమార్ డే తో బాటు ఈమె శనివారం ఓ కేఫ్ కు వెళ్తుండగా పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా ఈ ఇద్దరిపై వారు నిఘా పెట్టారు. లోగడ ఎయిర్ హోస్టెస్ గా, మోడల్ గా పని చేసిన ఈమె కొన్ని  టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.

 

Also Read:

Air India flight: ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు.. కమిటీ ఏర్పాటు.. కారణం ఇదే..

Mother Language Day : నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. భారత్‌లో అంతరించి పోయే దిశలో ఎన్ని భాషలున్నాయో తెలుసా..!