West Bengal Assembly Election 2021 : ‘స్కీమ్ లు కావాలంటే మోదీజీకి ఓటెయ్యండి.. స్కాములు కావాలంటే అసమర్థ తృణముల్ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఓటెయ్యండి’ అని పిలుపునిచ్చారు బీజేపీ కీలకనేత అమిత్ షా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు అమిత్ షా. బాగ్‌ముండి ఎన్నికల్ ర్యాలీలో అమిత్ షా మమతా బెనర్జీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీకు మరిన్ని సంక్షేమ పథకాలను అందించడానికి ఈ అసెంబ్లీలో గెలవాలని ప్రధాని మోదీజీ కోరుకుంటుంటే, తన మేనల్లుడిని తదుపరి ముఖ్యమంత్రిగా మార్చడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలను దీదీ కోరుకుంటున్నారని అమిత్ షా విమర్శించారు.
మమత మేనల్లుడిని మీ సీఎంగా చేయాలనుకుంటున్నారా.. ? లేదా బెంగాల్ లో అభివృద్ధి జరగాలనుకుంటున్నారా ? అని కేంద్ర హోంమంత్రి బెంగాల్ ప్రజలను ప్రశ్నించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు 18వేలు, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ తూచా తప్పక నెరవేరుస్తామని అమిత్ షా బెంగాల్ ప్రజలకు వాగ్ధానం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్ ముండితోపాటు, గోపిబల్లవ్‌పూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలోనూ అమిత్ షా.., మమత సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
Addressing a public meeting in Baghmundi, West Bengal. #EbarBJP https://t.co/ShyshHskOJ
— Amit Shah (@AmitShah) March 25, 2021
Speaking at a public rally in Gopiballavpur, West Bengal. #EbarBJP https://t.co/if1QhEGHNj
— Amit Shah (@AmitShah) March 25, 2021