
కర్ణాటక రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బళ్లారి కాల్పుల కేసుకి సంబంధించిన వ్యవహరంలో సస్పెండ్ అయిన ఎస్పీ పవన్ నజ్జూర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన తుమకూరు జిల్లా శిరాడ సమీపంలో ఉన్న తన ఫామ్‌హౌస్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని.. గమనించిన సిబ్బంది ఆయన్ను స్థానిక హాస్పిటల్కు తరలించినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే బళ్లారిలో బ్యానర్లు ఏర్పాటు విషయంలో చిన్నాగా మొదలైన గొడవ పెద్దదైంది. ఈ గొడవలో కాల్పుల జరగ్గా ఈ కాల్పుల్లో ఓ కాంగ్రెస్ కార్యకర్త మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బళ్లారి ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పవన్ నెజ్జూర్‌ను సర్వీసు నుండి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.