కళ్ల ముందు అచేతనంగా కన్నపేగు.. తిరిగి బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే..?

|

Sep 05, 2022 | 8:26 PM

'ఒక్కసారి లేవరా'.. 'అమ్మను వచ్చాను చూడరా' అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారి వేదన చూసి.. అక్కడి స్థానికుల కళ్లలో కూడా నీటి చెమ్మ కనిపించింది.

కళ్ల ముందు అచేతనంగా కన్నపేగు.. తిరిగి బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే..?
Boy Deadbody
Follow us on

ముద్దుగా పెంచుకున్న బిడ్డ.. ప్రేమను పంచి సాకిన బిడ్డ.. భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు వెళ్తాడని కలలు కన్న బిడ్డ.. కళ్ల ముందు విగతజీవిగా పడి ఉన్నాడు. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘ఒక్కసారి లేవరా’.. ‘అమ్మను వచ్చాను చూడరా’ అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారి వేదన చూసి.. అక్కడి స్థానికుల కళ్లలో కూడా నీటి చెమ్మ కనిపించింది. తమ బిడ్డను తిరిగి బ్రతికించుకుంటామంటూ ఆ తల్లిదండ్రులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనయుడు మృతదేహాన్ని గంటల తరబడి ఉప్పులో ఉంచారు. ఎంతసేపు ఉంచినా బాలుడిలో కదలిక రాకపోవడంతో.. గుండెల నిండా ఆవేదనతో అంత్యక్రియలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక(Karnataka)లోని బళ్లారి జిల్లా(ballari district) సిర్​వారా అనే గ్రామానికి చెందిన బాలుడు తన మిత్రులతో కలిసి.. దగ్గర్లోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండటం, ఈత సరిగ్గా రాకపోవడంతో.. నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే బాలుడి పేరెంట్స్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లారు. తనయుడి మృతదేహంపై పడి బోరున విలపించారు.

ఈ క్రమంలోనే నీటిలో మునిగి చనిపోయినవారి మృతదేహాన్ని ఉప్పులో ఉంచితే.. తిరిగి వారికి ప్రాణం వస్తుందని గతంలో ఎవరో చెప్పిన విషయం గుర్తుకువచ్చింది. వెంటనే 5 బస్తాలు ఉప్పు  తెచ్చి డెడ్‌బాడీపై పోశారు. అలా ఎన్ని గంటలు వేచి చూసినా.. బాలుడిలో చలనం రాలేదు. దీంతో చివరికి అంత్యక్రియలు చేశారు. ఇలాంటి మూఢనమ్మకాల గురించి మారుమూల పల్లెల్లో కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..