BBC UK Apologies: భార‌త‌దేశ ప‌టాన్ని త‌ప్పుగా చూపినందుకు క్షమాపణ తెలిపిన బీబీసీ…

| Edited By:

Jan 21, 2021 | 1:16 PM

భారతదేశ పటాన్ని తప్పుగా చూపించినందుకు బీబీసీ క్షమాపణలు చెప్పింది. ఆ సంస్థ ప్ర‌సారం చేసిన‌ వీడియోలలో ఒకదానిలో భారతదేశం...

BBC UK Apologies: భార‌త‌దేశ ప‌టాన్ని త‌ప్పుగా చూపినందుకు క్షమాపణ తెలిపిన బీబీసీ...
Follow us on

భారతదేశ పటాన్ని తప్పుగా చూపించినందుకు బీబీసీ క్షమాపణలు చెప్పింది. ఆ సంస్థ ప్ర‌సారం చేసిన‌ వీడియోలలో ఒకదానిలో భారతదేశం, జమ్మూకాశ్మీర్‌ మ్యాప్‌ను తప్పుగా చూపించింది .

ఎప్పుడు ప్ర‌సారం చేసిందంటే…

బీబీసీ లండన్ అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ గురించి ఒక వీడియో చేసింది. అందులో భారతదేశాన్ని కూడా ప్రస్తావించింది. కానీ భారతదేశానికి మ్యాప్ చూపించినప్పుడు మాత్రం జ‌మ్మూ కాశ్మీర్ లేకుండా చిత్ర ప‌టాన్ని ప్ర‌సారం చేసింది. దీంతో ఇండో-బ్రిటిష్ ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ అధినేత వీరేందర్ శర్మ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని బీబీసీకి లేఖ రాసి వెంటనే తొలగించాలని కోరారు.

 

వీరేంద్ర సింగ్ లేఖ తరువాత, ఆయనకు మద్దతుగా బీబీసీపై వివిధ వ‌ర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో బీబీసీ క్షమాపణ చెప్పవలసి వచ్చింది. అలాగే, ఆ వీడియోలో బీబీసీ భార‌త‌దేశ మ్యాప్‌ను సైతం మార్చి ప్ర‌సారం చేసింది. ఈ ఘ‌ట‌న‌పై బీబీసీ ప్ర‌తినిధి ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ… ఈ త‌ప్పు జ‌ర‌గాల్సింది కాదని, క్షమాపణలు తెలిపారు.