మధ్యప్రదేశ్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో పబ్‌లు, బార్లపై నిషేధం కొనసాగుతోంది. ఒక వేళ తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా కొందరు కరోనా నిబంధనలు ఉల్లంఘించడంతో అలాంటి వాటిపై ప్రభుత్వ అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఆరు బార్లు, పబ్‌లకు సీలు వేస్తూ ఇండోర్ సబ్ డివిజనల్ మెజస్ట్రేట్ ఆక్షయ్ సింగ్ ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్ నగరంలోని ఆరు బార్లు, పబ్‌లలో ధూమపానం చేయరాదని ఆదేశాలు జారీ చేసినా ..వారు ఉల్లంఘించారు.
అంతేకాకుండా బార్‌లు, పబ్‌లలో మాదకద్రవ్యాలను సైతం వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఆరు బార్లు, పబ్‌లకు డిసెంబర్ 31వ తేదీ వరకు సీలు వేస్తూ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికారులు ఆయా బార్లు, పబ్‌లకు సీలు వేశారు. కోవిడ్ వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
కాగా, గతంలో దేశంలో తీవ్ర స్థాయిలో ఉన్న కోవిడ్ కేసులు.. కాస్త తగ్గుముఖం పట్టాయి. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. దీంతో కోవిడ్ మరింత వ్యాపించకుండా గతంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి కరోనా వ్యాపించకుండా చేశారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో దేశంలో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో అన్ని రంగాలు తెరుచుకుని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లో బార్లకు, పబ్‌లకు అనుమతి ఇచ్చినా.. కొన్ని బార్లు, పబ్‌ల యజానులు కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోవడంతో అధికారులు కొరఢా ఝులిపించారు.