Uttar Pradesh: అవస్నేశ్వర్‌ ఆలయంలో తొక్కిసలాట..పలువురు మృతి… ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో విషాదం

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన విషాదం నుంచి తేరుకోక ముందే ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో మరో విషాదం చోటుచేసుకుంది. అవస్నేశ్వర్‌ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు మృతి చెందారు. శ్రావణ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అందరూ క్యూలైన్‌ ఉండగా షార్ట్‌సర్క్యూట్‌ వదంతులతో...

Uttar Pradesh: అవస్నేశ్వర్‌ ఆలయంలో తొక్కిసలాట..పలువురు మృతి... ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో విషాదం
Barabanki Temple Stampede

Updated on: Jul 28, 2025 | 7:31 AM

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన విషాదం నుంచి తేరుకోక ముందే ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో మరో విషాదం చోటుచేసుకుంది. అవస్నేశ్వర్‌ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు మృతి చెందారు. శ్రావణ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అందరూ క్యూలైన్‌ ఉండగా షార్ట్‌సర్క్యూట్‌ వదంతులతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఇద్దరు చనిపోగా.. 29 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు అయితే ఐదుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అర్థరాత్రి గం. 2.00 సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

భద్రత కోసం ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో పోలీసు బలగాలు మోహరించాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ అంబులెన్స్‌లో హైదర్‌గఢ్ మరియు త్రివేదిగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మరికొందరు తీవ్రంగా గాయపడిన వారిని బారాబంకి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి, పోలీసు సూపరింటెండెంట్ అర్పిత్ విజయవర్గియాతో పాటు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని కోతులు విద్యుత్ తీగపైకి దూకాయని, దాని కారణంగా తీగ విరిగి ఆలయ ప్రాంగణంలోని టిన్ షెడ్‌పై పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు.

ఈ సంఘటన తర్వాత, అవస్నేశ్వర్‌ మహాదేవ్ ఆలయం వద్ద పరిస్థితి సాధారణ స్థితి తీసుకొచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు క్రమం తప్పకుండా దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది. శ్రావణమాసం సదర్భంగా మహాదేవుడిని పూజించడానికి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. పురావస్తు శాఖ ప్రకారం, ఈ ఔసనేశ్వర్ మహాదేవ్ ఆలయం దాదాపు 450 సంవత్సరాల పురాతనమైనది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

మరోవైపు ఆదివారం ఉదయం హరిద్వార్‌లోని మానసదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మానస దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట షార్ట్‌ సర్క్యూట్‌ పుకారు కారణంగా సంభవించినట్లు అధికారులు గుర్తించారు.