Bank Timings: పెరుగుతున్న కరోనా కేసులు.. బ్యాంకు ఉద్యోగులపై ఎఫెక్ట్‌… బ్యాంకుల పని వేళల్లో మార్పులు..?

| Edited By: Ram Naramaneni

Apr 18, 2021 | 8:59 AM

Bank Employee Unions: కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ అందరిలోనూ కోవిడ్‌ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో...

Bank Timings: పెరుగుతున్న కరోనా కేసులు.. బ్యాంకు ఉద్యోగులపై ఎఫెక్ట్‌... బ్యాంకుల పని వేళల్లో మార్పులు..?
Follow us on

Bank Employee Unions: కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ అందరిలోనూ కోవిడ్‌ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల సమయ వేళలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్‌ యూనియన్లు ఇప్పటికే ఆర్థిక శాఖకు ఈ విషయాన్ని వెల్లడించారు. బ్యాంక్‌ ఉద్యోగుల భద్రత నేపథ్యంలో పని గంటలను తగ్గించాలని, లేదంటే పని దినాలను తగ్గించాలని యూనియన్లు డిమాండ్‌ చేశాయి. తక్కువ సిబ్బందితో బ్యాంక్‌ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వాలని కోరాయి.

యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) ఇప్పటికే ఆర్థిక శాఖ కార్యదర్శి దెబాశిష్‌ పాండాకు మెమోరాండం కూడా సమర్పించింది. కోవిడ్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బ్యాంకులు హాట్‌స్పాట్లుగా పని చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాలతో రావాలని తెలిపింది. అలాగే బ్యాంకు పని వేళల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంకా కొంత మంది ఉద్యోగులకు వచ్చే 4 నుంచి 6 నెలల కాలంపాటు ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం కల్పించాలని బ్యాంక్ యూనియన్లు కోరుతున్నాయి. అయితే బ్యాంకులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే పనిచేసేలా అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

కాగా, గత ఏడాది కరోనా నేపథ్యంలో చాలా రంగాలు కూడా వర్క్‌ ఫ్రం హోం ఇచ్చాయి. ఇప్పటి కూడా చాలా సంస్థలు వర్క్‌ ఫ్రం హోమ్‌ నిర్వహిస్తున్నాయి. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సెకండ్‌వేవ్‌ కరోనా తీవ్రంగా ఉండటంతో బ్యాంకు పని వేళలు తగ్గించాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. చాలా మంది బ్యాంకు ఉద్యోగులు కోవిడ్‌ బారిన పడి సెలవుల్లో ఉన్నాయి. దీంతో తక్కువ మంది సిబ్బందితో బ్యాంకుల నిర్వహణ కొనసాగుతున్నాయి. తాజాగా కరోనా తీవ్రత పెరిగిపోతుండటంతో పని వేళలు తగ్గించాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే బ్యాంకు ఉద్యోగులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో పని వేళలు తగ్గించాలని కోరుతున్నట్లు యూనియన్లు చెబుతున్నాయి. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్‌ను అంగీకరించాలని కోరుతున్నారు.

Credit Card Payment: క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారా..? అయితే ఇలా చేయండి

SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌.. రూ. 10వేలకు రూ.520 ఈఎంఐ.. ప్రాసెసింగ్‌ ఫీజు ఫ్రీ…

Mahindra Car: కొత్తగా కారు కొనే వారికి అదిరిపోయే బంపరాఫర్.. ఏకంగా రూ.3 లక్షల వరకు తగ్గింపు!