Watch Video: కర్ణాటకలో ఆటో డ్రైవర్లకు తలనొప్పిగా మారిన ఉచిత బస్సు ప్రయాణం.. 5 గంటల్లో కేవలం రూ.40 సంపాదించిన డ్రైవర్

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచాక.. తాజాగా ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసింది. దీంతో అక్కడ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఒకరినొకరు నెట్టుకుంటూ బస్సులు ఎక్కుతున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Watch Video: కర్ణాటకలో ఆటో డ్రైవర్లకు తలనొప్పిగా మారిన ఉచిత బస్సు ప్రయాణం.. 5 గంటల్లో కేవలం రూ.40 సంపాదించిన డ్రైవర్
Auto Driver

Updated on: Jun 29, 2023 | 5:18 AM

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచాక.. తాజాగా ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసింది. దీంతో అక్కడ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఒకరినొకరు నెట్టుకుంటూ బస్సులు ఎక్కుతున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆఖరికి కండక్టర్లకు కూడా బస్సులో టికెట్లు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. కొంతవరకు డబ్బులు మిగుల్చుకోవచ్చనే ఆశతో చాలా మంది మహిళలు ప్రభుత్వ బస్సుల వైపే పరుగులు పెడుతున్నారు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆటో డ్రైవర్లపై ప్రభావం చూపుతోంది.

ఎక్కవ మంది ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు మొగ్గు చూపడంతో ఆటో డ్రైవర్లకు గతంలో లాగా వచ్తే గిరాకీ తగ్గినట్లు కనిపిస్తోంది. తాజాగా బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ తన ఆవేదనను బయటపెట్టిన వీడియో అందర్ని కలచివేస్తోంది. ఉదయం 8.00 AM గంటల నుంచి మధ్యాహ్నం 1.00PM వరకు తిరిగితే కేవలం రూ.40 వచ్చాయని ఆ ఆటో డ్రైవర్ చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఈ వీడియో ఏ తేదిన తీశారన్న విషయంపై స్పష్టత లేదు. దీనికి సంబంధించి నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఈ ఆటో డ్రైవర్లపై సానుభూతి చూపిస్తుంటే మరికొందరేమో ఆ ఆటోడ్రైవర్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉచితాల కోసం ఆశపడి ఓటువేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఆడవాళ్లతో బస్సులు కిక్కిరిసిపోయినప్పుడు.. మగవాళ్లు ఇంటి లోపలే ఉండిపోయారా అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం