కర్నాటకలో సంచలనం సృష్టించిన లింగాయత్ మఠం బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో పోలీసులు ముగ్గురికి అరెస్ట్ చేశారు. బెంగళూర్ మహిళతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. బసవలింగ స్వామీజీని ఆ యువతే హనీట్రాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. తనను ప్రైవేట్ వీడియోలతో కొందరు బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేశారని సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు బసవలింగ స్వామీజీ. గుర్తుతెలియని మహిళ కారణంగానే తాను సూసైడ్ లేఖలో పేర్కొన్నారు స్వామీజీ. రామనగర జిల్లా కంచుగల్ బందేమఠంలో ప్రార్ధనా మందిరంలో శవమై కన్పించారు బసవలింగ స్వామీజీ. గత సోమవారం ఆయన ఆత్మహత్యకు పాల్పడడం లింగాయత్ సామాజిక వర్గంతో పాటు కర్నాటక ప్రజలను షాక్‌కు గురి చసింది. గదిలో కిటికీ ఊచలకు ఉరివేసుకొని స్వామీజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఓ మహిళ న్యూడ్ ఫోన్ కాల్స్ చేస్తూ బసవలింగ స్వామీజీని హనీట్రాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు . అయితే స్వామీజీపై హానీట్రాప్ వెనుక ఆశ్రమానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. వాళ్దిద్దరికి కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తన ఫోన్లోనే ఆ మహిళ స్వామీజీకి చెందిన వీడియోలను రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కర్నాటకలో బందేమఠానికి ఎంతో ప్రశస్తి ఉంది. తన కారణంగా మఠానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆవేదనతో బసవలింగ స్వామీజీ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది..
మరిన్ని జాతీయ వార్తల కోసం..