Ayodhya Airport: ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కార్‌ కీలక నిర్ణయం.. అయోధ్యలో విమానాశ్రయం పేరు ఖరారు

Ayodhya Airport:  ఉత్తరప్రదేశ్‌ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అయోధ్య విమానాశ్రయానికి పేరు ఖరారు చేసింది....

Ayodhya Airport: ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కార్‌ కీలక నిర్ణయం.. అయోధ్యలో విమానాశ్రయం పేరు ఖరారు

Updated on: Feb 22, 2021 | 9:08 PM

Ayodhya Airport:  ఉత్తరప్రదేశ్‌ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అయోధ్య విమానాశ్రయానికి పేరు ఖరారు చేసింది. రాముడి పేరు వచ్చేలా ‘మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ ఎయిర్‌పోర్ట్‌’ అని నామకరణం చేసింది. అలాగే బడ్జెట్‌లో ఎయిర్‌ పోర్ట్‌ డెవలప్‌మెంట్‌కు గానూ రూ. 101 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా దశల వారీగా దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. ఇక జవార్‌ విమానాశ్రయంలో ప్రస్తుతం రెండుగా ఉన్న ఎయిర్‌ స్ట్రిప్పులను ఆరుకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటూ రూ.2వేల కోట్లు యోగి ప్రభుత్వం కేటాయించింది. అలీగఢ్‌, మొరాదాబాద్‌, మీరట్‌ వంటి నగరాలకు త్వరలో విమాన సేవలు కల్పించబోతున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు.

Also Read: Onion Prices: మళ్లీ కోయకుండానే కన్నీళ్లు.. భారీగా పెరిగిన ఉల్లి ధర.. కిలోకు రూ. 60 నుంచి 70 రూపాయలు.. ఎక్కడంటే