
నువ్వు త్వరలోనే చనిపోతావ్ అని జోతిష్యుడు చెప్పిన మాటలు నిజమవుతాయేమో అని నమ్మిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృత్యువు ఆమెను చేరేలోపే ఆమె మృత్యువు ఓడికి చేరింది. చనిపోతాననే భయంతో ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌లో నివసిస్తున్న విద్యాజ్యోతి అనే యువతి ఓ మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఇటీవలే ఆమె తాను ప్రేమించిన కొడగు ప్రాంతానికి చెందిన యువకుడిని వివాహం కూడా చేసుకుంది. అయితే ఇటీవల ఆమె ఓ జ్యోతిష్యుడిని సంప్రదించగా నువ్వు ఎక్కవ కాలం జీవించలేవని.. త్వరలోనే చనిపోతావని చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తనకు మంచి జరగాలంటే తొమ్మిది రోజులు పూజలు చేసి చివరి రోజు తన తాళిని అమ్మవారికి సమర్పించాలని చెప్పాడు.
ఇక జోతిష్యుడు మాటలు నిజం అవుతాయని నమ్మి తీవ్రంగా భయపడిపోయిన విద్యజ్యోతి.. అతను చెప్పినట్టుగానే తొమ్మిది రోజుల పాటు ఇంట్లోని పూజలు చేసింది. ఇక చివరి రోజున తన తాళిని అమ్మవారికి సమర్పించేందుకు సిద్ధమైంది. కానీ అంతుకు ముందు ఆమె గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుండి. ఎంత సేపటికి జ్యోతి బయటకి రాకపోవడంతో, డోర్ కొట్టినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్‌ను బద్దలకొట్టి చూశారు. అప్పడు జ్యోతి గదిలో ఉన్న ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అది చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.