AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Voting 2026 Live: మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. భారీగా పోలింగ్ నమోదు!

Kerala, Puducherry, Assam Elections 2026 Voting Live Updates: కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అస్సాంలో మరోసారి గెలుపు తమదేనని బీజేపీ ధీమాగా ఉండగా.. కాంగ్రెస్ కేరళపై గంపెడాశలు పెట్టుకుంది.

Assembly Election Voting 2026 Live: మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. భారీగా పోలింగ్ నమోదు!
Kerala, Puducherry, Assam Elections 2026 Voting Live Updates 1
Balaraju Goud
|

Updated on: Apr 09, 2026 | 5:27 PM

Share

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. గత కొన్ని వారాలుగా సాగిన ప్రచారపర్వానికి ఇప్పటికే ఎండ్ కార్డ్ పడగా.. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈసారి కేరళ ఎన్నికల బరిలో ప్రధానంగా మూడు కూటములు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సీఎం పినరయి విజయన్ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుని రికార్డు సృష్టించాలని ఎల్డీఎఫ్ చూస్తోంది. సుపరిపాలన – సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని ఎల్‌డిఎఫ్ నమ్ముతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇందిరా గ్యారెంటీలు వంటి వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షిస్తోంది.  ఎన్డీఏ, ఈసారి కేరళలో బలమైన ముద్ర వేయాలని చూస్తోంది. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. అస్సాంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది.

పోలింగ్ సరళిపైనే అందరి కళ్లు

కేరళలో పెన్షన్ల పెంపు, ఉచిత వైద్యం వంటి అంశాలు ఓటర్ల మనసు గెలుచుకోవడంలో కీలకం కానున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, యువత వలసల అంశం ఈసారి ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. మెట్రో విస్తరణ, విజింజం పోర్ట్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులపై పార్టీల మధ్య హామీల యుద్ధం సాగింది. కాగా 2021 ఎన్నికల్లో 74.06 శాతం పోలింగ్‌ నమోదవ్వగా, ఈసారి ఆ శాతం పెరుగుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ శాతంలో వచ్చే స్వల్ప మార్పులు కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ముందస్తు సర్వేలు ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వకపోవడంతో, సామాన్య ఓటరు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Apr 2026 05:24 PM (IST)

    పోలింగ్ బూత్‌లో వీడియో తీసిన వ్యక్తిపై కేసు

    అస్సాంలోని దిఫు నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లోపల వీడియో తీసినందుకు ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దిఫు నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ లోపల జరుగుతున్న ప్రక్రియను చూపిస్తూ.. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా యంత్రాంగం ఈ ఫిర్యాదును దాఖలు చేసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పోలింగ్ బూత్‌ల లోపల మొబైల్ ఫోన్లు నిషేధం. లోపలికి ప్రవేశించే ముందు మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను డిపాజిట్ చేయడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

  • 09 Apr 2026 04:59 PM (IST)

    బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

    పుదుచ్చేరిలోని మన్నడిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. తిరుకనూర్ గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ సమీపంలో బీజేపీ కార్యకర్తల బృందం నిలబడి ఉంది. అక్కడ ఓటర్లు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. దీంతో వాగ్వాదం జరిగి, తోపులాటకు దారి తీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 09 Apr 2026 04:06 PM (IST)

    భారీ పోలింగ్ నమోదు

    మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అస్సాంలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 75.91% ఓటింగ్ నమోదైంది. కేరళలో 62.71% ఓటింగ్ నమోదైంది. పుదుచ్చేరిలో 72.40% ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

  • 09 Apr 2026 02:59 PM (IST)

    ఓటు వేసి ప్రాణాలు వదిలిన 62 ఏళ్ల వృద్ధుడు

    త్రిస్సూర్‌లో ఓటు వేయడానికి గంటన్నర పాటు క్యూలో నిలబడిన 62 ఏళ్ల వ్యక్తి, ఓటు వేసిన వెంటనే మరణించాడు. వానియంపరలో ఓటు వేసిన తర్వాత 62 ఏళ్ల వ్యక్తి అస్వస్థతకు గురై, కొద్దిసేపటికే మరణించాడు. మృతుడిని వానియంపర సమీపంలోని రామన్‌చిర నివాసి వినోదన్‌గా పోలీసులు గుర్తించారు. వినోదన్ ఉదయం తన ఓటు వేయడానికి వానియంపరలోని ఈకేఎం యూపీ పాఠశాలకు వచ్చాడు. ఓటు వేయడానికి ముందు అతను సుమారు గంటసేపు క్యూలో నిలబడ్డాడు.

  • 09 Apr 2026 02:56 PM (IST)

    వర్షాన్ని సైతం లెక్క చేయని ఓటర్లు

    ఆకాశం మేఘావృతమై, అడపాదడపా వర్షం కురుస్తున్నప్పటికీ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలిసారి ఓటు వేస్తున్న వారి నుండి వృద్ధుల వరకు, అన్ని వయసుల వారిలో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, గౌహతితో సహా కొన్ని చోట్ల ఉదయం నుండి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ, వాతావరణం ఓటింగ్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. జోర్హాట్, కామరూప్, కోక్రాఝర్, లఖింపూర్ వంటి జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల బయట పొడవైన క్యూలు కనిపించాయి. 126 స్థానాలున్న ఈ శాసనసభకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

  • 09 Apr 2026 02:54 PM (IST)

    కుటుంబసమేతంగా ఓటేసిన హిమంత బిస్వా

    అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గౌహతిలో తన భార్య రినికి శర్మ, పిల్లలతో కలిసి ఓటు వేశారు. జలుక్‌బరి నుంచి మూడోసారి పోటీ చేస్తున్న హిమంత, కామాఖ్య ఆలయంతో సహా పలు పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

  • 09 Apr 2026 02:03 PM (IST)

    ఒంటిగంటకు 50శాతం పోలింగ్

    • పుదుచ్చేరిలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
    • మధ్యాహ్నం 1 గంట వరకు 50శాతం పోలింగ్ నమోదు
    • సాయంత్రం 6 గంటలకల్లా ఓటింగ్ 80శాతం దాటుతుందని అధికారుల అంచనా
  • 09 Apr 2026 01:38 PM (IST)

    ఒంటి గంట వరకు 48.46 పోలింగ్

    • కేరళలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    • ఒంటి గంట వరకు 48.46 పోలింగ్ నమోదు
  • 09 Apr 2026 01:04 PM (IST)

    ఓటర్లకు విజయ్ కీలక పిలుపు

    • పుదుచ్చేరి ఎన్నికల వేళ ప్రజలకు విజయ్ కీలక పిలుపు
    • చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉండాలని సూచన
    • ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్న విజయ్ 
  • 09 Apr 2026 12:46 PM (IST)

    పోలింగ్ కేంద్రంలో పొగ

    • కారైకల్ సౌత్ నియోజకవర్గ పోలింగ్ కేంద్రంలో పొగ కలకలం 
    • సడెన్‌గా పొగ రావడంతో ఆందోళన చెందిన ఓటర్లు
    • 10 నిమిషాల పాటు ఓటింగ్ నిలిపివేసిన అధికారులు
    • సమస్య పరిష్కారం తర్వాత ఓటింగ్ ప్రారంభం
  • 09 Apr 2026 12:21 PM (IST)

    Shashi Tharoor: ఓటేసిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ 

    • కేరళలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
    • ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
    • వళుతక్కాడ్‌లోని కాటన్ హిల్ ప్రభుత్వ స్కూల్లో ఓటేసిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ 
  • 09 Apr 2026 12:04 PM (IST)

    ఏకే ఆంటోని కీలక కామెంట్స్

    • కేరళలో అధికారంలోకి వచ్చేది యూడీఎఫ్ కూటమే – ఏకే ఆంటోని
    • ఈ ఎన్నికలు ప్రజల తీర్పుకు స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తాయి – ఆంటోని
    • ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారు – ఆంటోని
  • 09 Apr 2026 11:37 AM (IST)

    11 గంటల వరకు 37.70 శాతం

    • కొనసాగుతున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    • ఉదయం 11 గంటల వరకు 37.70 శాతం ఓటింగ్ నమోదు
  • 09 Apr 2026 11:22 AM (IST)

    11 గంటల వరకు 33.02 శాతం పోలింగ్

    • కేరళలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    • ఉదయం 11 గంటల వరకు 33.02 శాతం పోలింగ్
    • పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
  • 09 Apr 2026 10:56 AM (IST)

    నకిలీ ఓట్లు అంటూ బీజేపీ ఫైర్

    • వడక్కంచెరిలో నకిలీ ఓట్లు అంటూ బీజేపీ ఆరోపణలు
    • సజీవ్ వేసిన ఓటును పోస్టల్ ఓటుగా నమోదు చేశారని ఫిర్యాదు
    • అధికారుల తీరుపై బీజేపీ ఆగ్రహం.. పోలింగ్ బూత్ వద్ద నిరస
  • 09 Apr 2026 10:26 AM (IST)

    Puducherry Elections: బైక్‌పై వచ్చి ఓటేసిన సీఎం

    • పుదుచ్చేరిలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    • బైక్‌పై వచ్చి ఓటేసిన సీఎం రంగస్వామి
    • మంగళం, తట్టంజవాడి నియోజకవర్గాల నుంచి పోటిచేస్తున్న రంగస్వామి
  • 09 Apr 2026 09:58 AM (IST)

    Kerala Polling percentage: 9గంటల వరకు 16.23 శాతం పోలింగ్

    • కేరళలో కొనసాగుతున్న పోలింగ్
    • ఉదయం 9గంటల వరకు 16.23 శాతం పోలింగ్ నమోదు
    • ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 17.8 శాతం పోలింగ్ నమోదు
  • 09 Apr 2026 09:35 AM (IST)

    18శాతం ఓటింగ్ నమోదు

    • కొనసాగుతున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు
    • ఉదయం 9 గంటల సమయానికి 18శాతం ఓటింగ్ నమోదు
  • 09 Apr 2026 09:03 AM (IST)

    ఓటేసిన మోహన్‌లాల్..

    • కొనసాగుతున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    • తిరువనంతపురంలోని ముడవన్ముక్కేలిలో ఓటేసిన మోహన్‌లాల్
    • నా వంతు అయ్యింది.. ఇప్పుడు మీ వంతు అంటూ మోహన్‌లాల్ పోస్ట్
  • 09 Apr 2026 08:45 AM (IST)

    ఓటేసిన సీఎం పినరయి విజయన్

    • కేరళ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన సీఎం పినరయి విజయన్
    • కుటుంబంతో కలిసి వచ్చి ఓటేసిన విజయన్
    • పినరయి లోని ఆర్‌సి అమల యూపీ పాఠశాలలో ఓటేసిన సీఎం

  • 09 Apr 2026 08:21 AM (IST)

    ఓటర్లకు రోబో స్వాగతం

    • పుదుచ్చేరిలో కొనసాగుతున్న పోలింగ్
    • వీఓసీ స్కూల్ పోలింగ్ బూత్‌లో నీలా అనే రోబో సందడి
    • ఓటర్లకు స్వాగతం పలుకుతున్న నీలా రోబో

  • 09 Apr 2026 08:02 AM (IST)

    మొరాయించిన ఈవీఎంలు

    • కేరళలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
    • పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరిన ఓటర్లు
    • పెరంబ్రాలోని 90, 91 బూత్‌లలో విద్యుత్ అంతరాయంతో నిలిచిన పోలింగ్
    • పెరింగోడ్ హైస్కూల్‌లో గల 178వ నంబరు బూత్‌లో పనిచేయని ఈవీఎం
  • 09 Apr 2026 07:35 AM (IST)

    బీజేపీ బూత్ ఏజెంట్‌పై దాడి

    • కేరళం మట్టనూర్ మలూరులో బీజేపీ బూత్ ఏజెంట్‌పై రాళ్ల దాడి ఆరోపణలు
    • సీపీఎం సభ్యులే రాళ్లు విసిరారని బీజేపీ ఆరోపణ
    • ఈ ఘటనలో మనోలి షైజు అనే వ్యక్తికి గాయాలు
  • 09 Apr 2026 07:17 AM (IST)

    ఆ కూటమిల మధ్య హోరాహోరీ

      • పుదుచ్చేరిలో నాలుగు కూటమిల మధ్య హోరాహోరీ
      • ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని తేజ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి..
      •  నామ్ తమిళర్ పార్టీ, టీవీకే పార్టీ మధ్య ప్రధాన పోరు

  • 09 Apr 2026 07:05 AM (IST)

    ప్రారంభమైన పోలింగ్..

    • కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్..
    • కేరళలో 140 స్థానాలు, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్

Published On - Apr 09,2026 7:03 AM

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం