Assam Floods 2022: వరుణుడి బీభత్సం.. అస్తవ్యస్థంగా మారిన అస్సాం.. 90శాతం నీళ్లలోనే..

|

Jun 19, 2022 | 1:54 PM

రాష్ట్రం వరదలతో కుదేలవుతోంది. సాధారణ జనజీవనానికి భారీ వర్షాలు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కుండపోత వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాల కారణంగా ..

Assam Floods 2022: వరుణుడి బీభత్సం.. అస్తవ్యస్థంగా మారిన అస్సాం.. 90శాతం నీళ్లలోనే..
Assam's Flood
Follow us on

అసోం రాష్ట్రం వరదలతో కుదేలవుతోంది. సాధారణ జనజీవనానికి భారీ వర్షాలు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కుండపోత వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగం..నీటిలోనే ఉండిపోయింది. రాజధాని గువహటి వీధుల్లోనూ వరద నీరు ఏరులై పారుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు సుమారు 25 మంది మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో ఎనిమిది మంది ఆచూకీ కనిపించడం లేదు. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో సుమారు 31 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ప్రభావానికి గురైనట్టు అంచనా వేస్తున్నారు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు పొంగి ప్రవహిస్తుండడంతో.. సుమారు 4,291 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. 66,455 పంట భూమి నీట మునిగింది.

అధికార యంత్రాంగం ముమ్మర సహాయక చర్యలు చేపట్టింది. చిరంగ్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 100 మంది గ్రామస్థులను తాడు సాయంతో కాపాడారు. చిన్నపాటి పడవుల సాయంతో వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 514 సహాయక శిబిరాల్లో 1.56 లక్షల మంది ఆశ్రయం పొందారు. ప్రధాని మోడీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి తాజా పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గువహటి వీధుల్లో వరద నీరు పారుతుండగా.. పెద్ద పెద్ద చేపలు ఈదుకుంటూ వెళుతున్న దృశ్యాలు అక్కడి వారి కంట పడుతున్నాయి. దీంతో కొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇందులో ఒక వీడియో ఆసక్తితో పాటు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.