Lady Singham Junmoni: ఎస్సై కాదు నిజజీవితంలో గొప్ప నటి.. అవినీతి బయటపడి కటకటాలు లెక్కిస్తున్న అసోం లేడీ సింగం

రభా గత నెలలో తన కాబోయే భర్తను అరెస్టు చేసి లేడీ సింగంగా పేరుతెచ్చుకుంది. ఇద్దరు కాంట్రాక్టర్లు రభా తన కాబోయే భర్త రాణా పోగాగ్‌తో కలిసి ఓఎన్‌జీలో ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుని మోసం చేశారంటూ ఫిర్యాదులు అందాయి.

Lady Singham Junmoni: ఎస్సై కాదు నిజజీవితంలో గొప్ప నటి.. అవినీతి బయటపడి కటకటాలు లెక్కిస్తున్న అసోం లేడీ సింగం
Assam Lady Singham Junmoni

Updated on: Jun 05, 2022 | 3:01 PM

Lady Singham Junmoni: ఇటీవల తనకు కాబోయే భర్తను అరెస్ట్ చేసి.. గొప్ప నిజాయితీ పోలీసు అధికారిణి..  లేడీ సింగం గా ప్రశంసలు అందుకున్న జున్మణి రభాని గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను తాను రక్షించుకోవడానికి, అసోం పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ ఆమె కాబోయే భర్తను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ యూనిఫాం ధరించి, కాబోయే భర్తతో కలిసి.. ఈ మహిళా పోలీసు అధికారి ఆడిన నాటకం బయటపడింది. ప్రస్తుతం ఈ లేడీ ఇన్‌స్పెక్టర్ ఇప్పుడు కటకటాలపాలయ్యారు. నాగావ్ జిల్లాలో సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మణి రభాను అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె మజులీ జిల్లాలోని కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వివరాల్లోకి వెళ్తే..

రభా గత నెలలో తన కాబోయే భర్తను అరెస్టు చేసి లేడీ సింగంగా పేరుతెచ్చుకుంది. ఇద్దరు కాంట్రాక్టర్లు రభా తన కాబోయే భర్త రాణా పోగాగ్‌తో కలిసి ఓఎన్‌జీలో ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుని మోసం చేశారంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె కాబోయే భర్త పోగాగ్‌ను అరెస్ట్ చేసింది.

గతేడాది అక్టోబర్‌లో ఆమెకు పోగాగ్‌తో నిశ్చితార్థం అయ్యింది. ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, జనవరిలో బిహ్‌పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడంతో రభా ఈ వివాదంలో చిక్కుకుంది. లీక్‌ అయిన ఆ ఆడియో టేప్‌ తీవ్ర దుమారానికి తెరలేపింది. దీంతో తన తప్పును కప్పించుకునేందుకు కాబోయే భర్తను అరెస్ట్ చేస్తున్నట్లు పెద్ద నాటకమాడింది. పోలీసుల విచారణలో అసలు వ్యవహారం బయటపడటంతో రభాను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..