Demolish Taj Mahal: తాజ్‎మహాల్,కుత్‎బ్‎మినార్ లను కూల్చివేసి వాటి స్థానాల్లో ఇవి నిర్మించండి..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మొగలుల చరిత్రపై 12 వ తరగతి పాఠ్య పుస్తకాలలో ఎన్‎సీఈ‎ఆర్‎టీ కొన్ని ఛాప్టర్లు తొలిగించదన్న విషయం ఇప్పడు చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు తాజాగా అస్సాం కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కూర్మీ మరికొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసి కాంట్రవర్సీని సృష్టించడం కలకలం రేపుతోంది.

Demolish Taj Mahal: తాజ్‎మహాల్,కుత్‎బ్‎మినార్ లను కూల్చివేసి వాటి స్థానాల్లో ఇవి నిర్మించండి..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Taj Mahal And Qutb Minar

Updated on: Apr 06, 2023 | 2:44 PM

మొగలుల చరిత్రపై 12 వ తరగతి పాఠ్య పుస్తకాలలో ఎన్‎సీఈ‎ఆర్‎టీ కొన్ని ఛాప్టర్లు తొలిగించదన్న విషయం ఇప్పడు చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు తాజాగా అస్సాం కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కూర్మీ మరికొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసి కాంట్రవర్సీని సృష్టించడం కలకలం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంటనే తాజా మహాల్, కుత్‎బ్‎మినార్ లను కూల్చివేయాలని జ్యోతి కూర్మీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. వాటి స్థానాల్లో హిందూ దేవాలయాలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వీటి నిర్మాణానానికి తన ఏడాది జీతాన్ని కూడా విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఆ రెండు దేవాలయాల నిర్మాణం ఏ ఇతర స్మారక కట్టడాలకు దగ్గరగా ఉండకూదని తెలిపారు.

అలాగే తాజ్‎మహాల్ అనేది ప్రేమకు చిహ్నం కాదని రూప్ జ్యోతి కూర్మి అన్నారు. షా జహన్ తాజ్‎మహాల్ ని తన నాలగవ భార్యైన ముంతాజ్ కోసం కట్టించాడని తెలిపాడు. షాజహన్ నిజంగా ముంతాజ్ ను ప్రేమించినట్లైతే ఆమె చనిపోయాక మరో మూడు సార్లు ఎందుకు వివాహం చేసుకున్నారని ప్రశ్నించారు. కావాలంటే దీనిపై విచారణ కూడా జరిపించాలని కోరారు. అలాగే మహాత్మ గాంధీ హత్య, హిందూ ముస్లీం ఐక్యత, ఆరెస్సెస్ నిషేధం వంటి అంశాలను 11,12 వ తరగతి పాఠ్య పుస్తకాల్లో తొలగించడం వల్ల ఎన్‎సీఈ‎ఆర్‎టీ పై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..