మహా కుంభమేళ భక్తులకు అలర్ట్‌.. అవన్నీ ఫేక్‌ న్యూస్‌..! కేంద్రమంత్రి వివరణ..

జనవరి 13న మహా కుంభమేళ ప్రారంభమైనప్పటి నుండి గత 26 రోజుల్లో, 42 కోట్లకు పైగా యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టుగా ప్రాధమికంగా అధికారులు నిర్ధారించారు. దేశ, విదేశాల నుండి సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో రైలు ప్రయాణం సజావుగా, సురక్షితంగా ఉండేలా అన్ని ప్రయాగ్‌రాజ్ రైలు స్టేషన్లలో సరైన ఏర్పాట్లు చేసినట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. 

మహా కుంభమేళ భక్తులకు అలర్ట్‌.. అవన్నీ ఫేక్‌ న్యూస్‌..! కేంద్రమంత్రి వివరణ..
Ashwini Vaishnaw

Updated on: Feb 10, 2025 | 12:46 PM

2025 మహాకుంభమేళాలో మూడు అమృతస్నానాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రయాగ్‌రాజ్‌లోకి భక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. జనవరి 13న మహా కుంభమేళ ప్రారంభమైనప్పటి నుండి గత 26 రోజుల్లో, 42 కోట్లకు పైగా యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టుగా ప్రాధమికంగా అధికారులు నిర్ధారించారు. దేశ, విదేశాల నుండి సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో రైలు ప్రయాణం సజావుగా, సురక్షితంగా ఉండేలా అన్ని ప్రయాగ్‌రాజ్ రైలు స్టేషన్లలో సరైన ఏర్పాట్లు చేసినట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు.

ఈ మేరకు రైల్వే శాఖ వివరాల ప్రకారం.. ప్రజలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, రంగు-కోడెడ్ టిక్కెట్లు, ప్రత్యేకించిన షెల్టర్ స్లాట్‌లను కూడా ప్రవేశపెట్టారు. ప్రయాణీకులు తమ షెడ్యూల్ చేయబడిన రైలు బయలుదేరే సమయానికి ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. సివిల్ పోలీసుల సమన్వయంతో, స్థానిక టాక్సీ, ఆటో, ఇ-రిక్షా డ్రైవర్లు ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, యాత్రికులకు సజావుగా గమ్యస్థానాలకు చేర్చేలా సరైన మార్గాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 10న 12.5 లక్షల మంది యాత్రికులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వివరాలు వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ ప్రాంత స్టేషన్ల నుండి రికార్డు స్థాయిలో 330 రైళ్లు బయలుదేరాయి. ఈరోజు ఇప్పటివరకు 130 రైళ్లు కుంభమేళా ప్రాంతం నుండి బయలుదేరాయి. అన్ని మహాకుంభమేళా రైల్వే స్టేషన్లు సజావుగా నడుస్తున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.. కొన్ని రైల్వే స్టేషన్లు మూసి వేశారు. రైళ్ల రద్దు వంటి వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని, వాటిని ప్రజలు విశ్వసించరాదని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..