ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో మొబైల్ తయారీ రంగం 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రంగంలో మొత్తం ఎగుమతులు 15 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక దేశంలో మొత్తం ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్నాయని అశ్విన్ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. మొబైల్ తయారీ రంగంలో రానున్న రోజుల్లో 12 లక్షల ఉద్యోగాలు రానున్నాయని మంత్రి తెలిపారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన అశ్విని వైష్ణవ్.. భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న కేటగిరీల్లో మొబైల్ ఫోన్స్ నాల్గవ అతిపెద్ద ఎగుమతి కేటగిరీగా ఉంది. వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు మొదటి 2 లేదా 3వ స్థానానికి చేరుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రాసెస్ చేసిన పెట్రోలియం, వజ్రాలు, ఇనుము, ఉక్కు, ఫార్మాస్యూటికల్స్ టాప్ 5 జాబితాలో ఉన్నాయి.
భారతదేశం అక్టోబర్ 2022 నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో 1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2023-24 ఆర్థిక ఏడాదికి గాను మొదటి 6 నెలల్లో, స్మార్ట్‌ఫోన్ ఎగుమత్తులో 6.53 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక 2022-2023లో మొత్తం 10,95 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదలకు యాపిల్ ఇండియా కీలకపాత్ర పోషించింది. మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో యాపిల్ 62 శాతంగా నమోదయ్యాయి. స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో భారతదేశం వేగవంతమైన వృద్ధి సాధించిందని అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు.
📱22 X increase in ‘Made in India’ mobile phone production.
🎯12 lakh employment generated (direct + indirect).@ICEA_India pic.twitter.com/hp8VQeiV4w
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 15, 2023
ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతమైందని ఆయన అన్నారు. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో 2023 ఏడాదికి గాను 775.5 బిలియన్ డాలర్లుగా ఉందని, వీటిలో సరుకుల ఎగుమతులు 450.4 బిలియన్ డాలర్లు కాగా, సేవల ద్వారా 325.4 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..