తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేల బేరసారాలకు బీజేపీ పాల్పడుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆడియో టేపులు బయటపడ్డాయని, వాటిలోని నిజానిజాలను నిర్ధారించేందుకు వాటిని అమెరికాకు పంపుతామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇద్దరు రెబెల్ సభ్యులతో సంభాషణలు సాగించినట్టు చెబుతున్న ఈ ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇవి అసలైనవి కావని, ఫేక్ అని, తమ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఎవరో వీటిని తయారు చేశారని బీజేపీ, రెబెల్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఏమైనప్పటికీ.. వాళ్ళు స్పెషల్ ఆపరేషన్ గ్రూపును నమ్మబోరని, తాము వారి సీబీఐని విశ్వసించబోమని, అందుకే వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించేందుకు తాము అమెరికాకు పంపుతామని అశోక్ గెహ్లాట్ చెప్పారు.