Affairs: వివాహేతర సంబంధాలు దేశంలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో తెలుసా..?

దేశంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. దీంతో బంధాలు, అనుబంధాలు చెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో....కట్టుకున్నవాళ్లను కడతేరుస్తున్నారు. హనీమూన్‌కి మేఘాలయకు వెళ్లి భర్తను కడతేర్చింది ఓ భార్య. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త పెళ్లికొడుకును కడతేర్చింది ఓ నవ వధువు. ఇండియాలో ఇలాంటి వివాహేతర సంబంధాలు గుబులు పుట్టిస్తుంటే...ఓ నగరం వీటికి అడ్డాగా మారింది. మహా నగరాలైన ముంబై, ఢిల్లీలను తోసిరాజని, వివాహేతర సంబంధాల్లో టాప్‌ సిటీగా నిల్చింది. వివాహేతర సంబంధాలపై ఓ డేటింగ్‌ యాప్‌ వెల్లడించిన విషయాలు వింటే, బాప్‌రే అనాల్సిందే!

Affairs: వివాహేతర సంబంధాలు దేశంలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో తెలుసా..?
Extra Marital Affair

Updated on: Jul 24, 2025 | 7:11 PM

కథలన్నీ కంచికి చేరతాయంటారు. అలాగే ఈ వివాహేతర సంబంధాల కథ కూడా కంచికి చేరింది. వివాహేతర సంబంధాల్లో దేశంలోనే టాప్‌సిటీగా పేరు తెచ్చుకుంది తమిళనాడులోకి కాంచీపురం. ఈ వివరాలు ప్రముఖ గ్లోబల్‌ డేటింగ్‌ సైట్‌ ఆష్లే మ్యాడిసన్‌ వెల్లడించింది. వివాహేతర సంబంధాల్లో ఏయే నగరాలు టాప్‌లో ఉన్నాయో తెలుసుకుందాం.

ఆశ్చర్యకరంగా జూన్ 2025 డేటా ప్రకారం తమిళనాడులోని కాంచీపురం అనే పట్టణం భారతదేశ వివాహేతర సంబంధాల రాజధానిగా నిలిచింది.  గత సంవత్సరం ఈ చిన్న పట్టణం 17వ స్థానంలో ఉండగా.. 1వ స్థానానికి ఎగబాకడం గమనార్హం. రెండవ స్థానంలో సెంట్రల్ ఢిల్లీ ఉంది.  గురుగ్రామ్‌, గౌతమ్‌బుద్ధనగర్, సౌత్‌ వెస్ట్ ఢిల్లీ, డెహ్రాడూన్, ఈస్ట్ ఢిల్లీ, పూణే, బెంగళూరు, సౌత్‌ ఢిల్లీ, చండీగఢ్, లక్నో, కోల్‌కతా, వెస్ట్ ఢిల్లీ, కామ్‌రూప్, నార్త్‌వెస్ట్ ఢిల్లీ, రాయ్‌గఢ్, హైదరాబాద్, ఘజియాబాద్‌, జైపూర్ ప్రాంతాల్లో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మన దేశంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరగడానికి కారణాలేంటో….ఆష్లే మ్యాడిసన్‌ డేటింగ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించలేదు. కానీ దేశంలోనే ఏయే నగరాల్లో వివాహేతర సంబంధాలు పెరిగాయో మాత్రం ఈ డేటింగ్‌ సైట్‌ వెల్లడించింది. ఇది జూన్‌, 2025 డేటా అని చెబుతోంది ఆ డేటింగ్‌ సైట్‌. అంటే లేటెస్ట్‌ గణాంకాలు అన్నమాట. ఈ డేటింగ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాలు…దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి.

ఆష్లే-మేడిసన్‌ అడల్ట్‌ డేటింగ్‌ యాప్‌ పాపులారిటీ టైర్‌2, టైర్‌ 3 సిటీస్‌లో వివాహేతర సంబంధాలు పెరగడం కూడా గమనార్హం. ఇక టాప్‌ 20 జాబితాలో ఏకంగా 9 ప్లేసులను కైవసం చేసుకుంది ఢిల్లీ. దేశ రాజధానిగానే కాదు..వివాహేతర సంబంధాల్లో రాజధానిగా కూడా ఢిల్లీ తన హవాను కొనసాగిస్తోంది. అయితే ఇతర మెట్రో నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి.

ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై…ఈ వివాహేతర సంబంధాల చార్టులో, ఇంతకుముందు సెకండ్‌ ప్లేసులో ఉండేది. అది ఆ ర్యాంక్‌ నుంచి చాలా వరకు దిగిపోవడం ఆశ్చర్యకర అంశం. ప్రస్తుతం ముంబై టాప్‌-20లో కూడా లేదు. బాలీవుడ్‌ కేపిటల్‌…గ్లామర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ముంబై, ఈ లిస్టులో లేకపోవడం, అందరిని ఆశ్చర్యంలో పడేసింది. ఇక టైర్‌-2 నగరాల్లో ఈ వివాహేతర బంధాల ట్రెండ్‌ ఎక్కువగా నడుస్తోందట. ఇక దేశంలో 53శాతంమంది వివాహితులు, తమ పార్టనర్‌ని మోసం చేస్తున్నట్లు ఈ సర్వేలో ఒప్పుకున్నారట.

ఆష్లే మాడిసన్ గురించి

ఆష్లే మాడిసన్ ఏజెన్సీ అనేది కెనడియన్-ఫ్రెంచ్ సోషల్ నెట్‌వర్కింగ్ డేటింగ్ సర్వీస్.  ఇది 2002లో ప్రారంభమైంది.  వివాహేతర సంబంధాలను కోరుకునే వివాహిత వ్యక్తులకు ఇది సేవలు అందిస్తుంది. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..