ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా అని కేజ్రీవాల్ ప్రకటించారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళతానని చెప్పారాయన. తన భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తాను అవినీతి చేయలేదని భావిస్తేనే ప్రజలు తనకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మళ్లీ గెలిస్తేనే సీఎం పదవిని చేపడతా అని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు దేవుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని.. భగవంతుడు ఇచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామన్నారు.
#WATCH | Delhi: CM Arvind Kejriwal says, "They sent me to jail because their goal was to break the AAP and the courage of Arvind Kejriwal… They thought they would break our party and form a government in Delhi after jailing me… But our party did not break… I did not resign… pic.twitter.com/o0SJqoiujL
— ANI (@ANI) September 15, 2024
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి రిలీజయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కుట్రపై సత్యం విజయం సాధించిందని చెప్పారు. దేశాన్ని విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి