‘370 అధికరణాన్ని రద్దు చేసినందుకే చైనా ఆక్రమణ’, ఫరూక్ అబ్దుల్లా

| Edited By: Pardhasaradhi Peri

Oct 11, 2020 | 7:15 PM

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసినందుకే చైనా లడాఖ్ లో ఆక్రమణకు దిగిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అధికరణాన్ని రద్దు చేయడాన్ని చైనా అంగీకరించలేదన్నారు. చైనా మద్దతుతో మళ్ళీ ఈ ఆర్టికల్ ని పునరుధ్దరించే అవకాశాలు ఉన్నాయన్నారు. అంటే తమ పార్టీ ఈ విషయంలో ఆ దేశ సపోర్టును కోరుతోందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. లడాఖ్ లో […]

370 అధికరణాన్ని రద్దు చేసినందుకే చైనా ఆక్రమణ, ఫరూక్ అబ్దుల్లా
Follow us on

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసినందుకే చైనా లడాఖ్ లో ఆక్రమణకు దిగిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అధికరణాన్ని రద్దు చేయడాన్ని చైనా అంగీకరించలేదన్నారు. చైనా మద్దతుతో మళ్ళీ ఈ ఆర్టికల్ ని పునరుధ్దరించే అవకాశాలు ఉన్నాయన్నారు. అంటే తమ పార్టీ ఈ విషయంలో ఆ దేశ సపోర్టును కోరుతోందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. లడాఖ్ లో వాళ్ళు (చైనా) చేస్తున్నదంతా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలోనే ! వాళ్లకు కేంద్రం ఇలా చేయడం ఇష్టం లేదు ‘ అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడిని తానేమీ ఆహ్వానించలేదని, ప్రధానే ఆహ్వానించి ఆయనతో ‘ఉయ్యాలలూగారని’, చైనా కు ఆయనను తీసుకువెళ్లి ఆయనతో కలిసి ఫుడ్ తిన్నారని ఫరూక్ వ్యంగ్యంగా సెటైర్ వేశారు.

370 ఆర్టికల్ ని కేంద్రం పునరుధ్దరించేంతవరకు తాము పోరాడుతామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. ఇది తమ హక్కని అన్నారు.