Maha Shivratri Prasad : శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి .. ప్రసాదం తిన్న 70మందికి పైగా భక్తులకు అస్వస్థత

|

Mar 12, 2021 | 12:00 PM

దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పురస్క‌రించుకుని ఓ ఆల‌యంలో పంపిణీ చేసిన ప్రసాదం తిన్న భక్తులు భారీ సంఖ్యలో అస్వస్థతకు...

Maha Shivratri Prasad : శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి .. ప్రసాదం తిన్న 70మందికి పైగా భక్తులకు అస్వస్థత
Mahashivratri Prasad
Follow us on

Maha Shivratri Prasad  : దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పురస్క‌రించుకుని ఓ ఆల‌యంలో పంపిణీ చేసిన ప్రసాదం తిన్న భక్తులు భారీ సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో ఆస్పూర్ గ్రామంలోని శివాలయంలో ప్రతి ఏడాది ఘనంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపధ్యములో ఈ సంవత్సరం కూడా ఘనంగా శివరాత్రి ఉత్సవాలను జరిపించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అభిషేకాది పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు అర్చకులు ప్రసాదం పంపిణీ చేశారు. ఆ ప్రసాదం తిన్న భక్తుల్లో సుమారు 70 మంది తీవ్ర అస్వస్ధతకు లోనయ్యారు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కావడమని ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఆస్పత్రిలో మూడు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని ఆస్పూర్ ఆస్పత్రి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చెప్పారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

Also Read: