కాంగ్రెస్ పార్టీపై దావా వేస్తా, కోర్టుకీడుస్తా, వారివన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలు, రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి

| Edited By: Pardhasaradhi Peri

Jan 21, 2021 | 1:49 PM

తన పైన, తన నెట్ వర్క్ పైన తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నేతపైనా దావా వేస్తానని రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి హెచ్ఛరించారు...

కాంగ్రెస్ పార్టీపై దావా వేస్తా, కోర్టుకీడుస్తా, వారివన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలు, రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి
Follow us on

తన పైన, తన నెట్ వర్క్ పైన తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నేతపైనా దావా వేస్తానని రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి హెచ్ఛరించారు. వారివన్నీ పూర్తిగా తప్పుడు కథనాలని, కట్టుకథలని, వక్రీకరించిన వ్యాఖ్యలని ఆయన అన్నారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వారిని కోర్టుకు లాగుతానన్నారు. బాలాకోట్ వైమానిక దాడుల గురించి అర్నాబ్ కు ముందే తెలుసునని, ఇది దేశద్రోహ చర్యేనని, అతనికి, రేటింగ్స్ ఏజెన్సీ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తాకు మధ్య నడిచిన వాట్సాప్ సంభాషణే ఇందుకు నిదర్శనమని, లీకైన ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ నేతలంతా డిమాండ్ చేసిన విషయం గమనార్హం. ఇది దేశద్రోహం కాక మరేమిటని వారు ప్రశ్నించారు. అత్యంత రహస్య సమాచారం లీక్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే అర్నాబ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ.. జాతీయ భద్రతతో తను రాజీ పడ్డానన్న అభియోగాలు అబధ్ధాలని అన్నారు. ఇది వారి ఉన్నత స్థాయి నాయకులకు కూడా తెలుసునన్నారు.

లీగల్ కేసులు, ఇంటరాగేషన్లు, మీడియాలోని వారి తొత్తుల ద్వారా తనను బెదిరించాలని చూస్తున్నారని అర్నాబ్ అన్నారు. ప్రతి కాంగ్రెస్ నేతపైన నేను క్రిమినల్ ఫిర్యాదు చేస్తాను అని చెప్పారు. కాగా ఈ వ్యవహారాన్ని తాము పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో లేవనెత్తుతామని మాజీ మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు వెల్లడించారు.