ఆర్మీ చీఫ్‌ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్…

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. హింసను ప్రేరేపిస్తూ.. ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించేవారు నాయకులు కారని.. నాయకుడంటే ముందుండి నడిపించే వాడని ఆర్మీ చీఫ్  ఓ కార్యక్రమంలో భాగంగా వ్యాఖ్యానించారు.  తాజాగా జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఉద్దేశించి రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH Army Chief Gen Bipin Rawat: Leaders are […]

ఆర్మీ చీఫ్‌ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్...

Edited By:

Updated on: Dec 27, 2019 | 5:14 PM

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. హింసను ప్రేరేపిస్తూ.. ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించేవారు నాయకులు కారని.. నాయకుడంటే ముందుండి నడిపించే వాడని ఆర్మీ చీఫ్  ఓ కార్యక్రమంలో భాగంగా వ్యాఖ్యానించారు.  తాజాగా జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఉద్దేశించి రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆర్మీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బిపిన్ రావత్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఏఏ ఆందోళనలపై.. ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు.. దేశంలోని ప్రజా ప్రభుత్వాన్ని బలహీనపరచడమేనన్నారు. ప్రజస్వామ్యంలో నిరసనలు తెలపడం ప్రాథమిక హక్కు అని.. ‘పౌరుల సంబంధిత అంశాల్లో సైన్యం జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నదన్నారు. ఇదే ఇతర దేశాలకు.. మన భారత దేశానికి ఉన్న వ్యత్యాసమన్నారు. ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.