Watch: పాక్ కాల్పుల్లో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ వీర మరణం.. స్వగ్రామానికి వీర జవాన్‌ పార్థివ దేహం

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌ లోని సత్యసాయి జిల్లాకు చెందిన అమరజవాన్‌ మురళీనాయక్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వీర జావన్‌కు నివాళులర్పించేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. బైకులపై మురళీ ఫొటోలు పట్టుకుని ఆఖరి మజిలీ వరకు నడిచారు. జై జవాన్.. జై మురళీ అంటూ నినాదాలు చేస్తూ వాహనం వెంట ర్యాలీ నిర్వహించారు.

Watch: పాక్ కాల్పుల్లో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ వీర మరణం.. స్వగ్రామానికి వీర జవాన్‌ పార్థివ దేహం
Rifleman Sunil Kumar

Updated on: May 11, 2025 | 2:08 PM

దేశం కోసం మరో సైనికుడు ప్రాణాలర్పించారు. పాక్ కాల్పుల్లో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ వీర మరణం పొందారు. జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్ లో పాక్ దుశ్చర్యకు 25 ఏళ్ల రైఫిల్‌మన్‌ సునీల్ కుమార్ అమరుడయ్యాడు. సునీల్ కుమార్ స్వస్థలం జమ్మూలోని ట్రెవా గ్రామం. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పాకిస్తాన్ తీవ్ర ఫిరంగి కాల్పుల మధ్య ఈ సంఘటన జరిగింది. ఆదివారం అమరుడైన జవాను మృతదేహాన్ని ఆయన నివాసానికి సహచర సైనికులు తీసుకొచ్చారు. సునీల్ కుమార్ మృతదేహం చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌ లోని సత్యసాయి జిల్లాకు చెందిన అమరజవాన్‌ మురళీనాయక్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వీర జావన్‌కు నివాళులర్పించేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. బైకులపై మురళీ ఫొటోలు పట్టుకుని ఆఖరి మజిలీ వరకు నడిచారు. జై జవాన్.. జై మురళీ అంటూ నినాదాలు చేస్తూ వాహనం వెంట ర్యాలీ నిర్వహించారు. మురళీ నాయక్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ మురళీ మృతదేహానికి నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..