కరోనా హీరోలకు త్రివిధ దళాల సంఘీభావం.. ‘ప్లై పాస్ట్’ చేస్తామన్న బిపిన్ రావత్..!

| Edited By:

May 01, 2020 | 7:49 PM

కరోనాపై పోరు చేసే హీరోలకు త్రివిధ దళాల తరఫున మే 3న సంఘీభావం చెప్తావని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌ అన్నారు

కరోనా హీరోలకు త్రివిధ దళాల సంఘీభావం.. ప్లై పాస్ట్ చేస్తామన్న బిపిన్ రావత్..!
Follow us on

కరోనాపై పోరు చేసే హీరోలకు త్రివిధ దళాల తరఫున మే 3న సంఘీభావం చెప్తావని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌ అన్నారు. కరోనా కష్టకాలంలో ముందుడి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ డిఫెన్స్‌ తరఫున కృతఙ్ఞతలు చెప్పేందుకు త్రివిధ దళాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, మెడికల్ ప్రొఫెషన్స్‌, పోలీస్‌, మీడియా, డెలివరీ బాయ్స్‌ అందరికీ తమ తరఫున ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్తామని పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్‌ నేతృత్వంలో శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు దిబ్రుఘర్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకు వైమానిక దళాల ఫ్లై పాస్ట్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయంలో భారత వైమానిక దళాల వారు కరోనా ఆసుపత్రులపై పూలను వెదజల్లుతారని చెప్పారు. మరోవైపు తీర పాంతాల్లోని యుద్ధనౌకలను లైటింగ్‌తో అలరించి కరోనా వారియర్స్‌కు సంఘీభావం తెలుపుతుందని వివరించారు. అలాగే ఆర్మీ మౌంటైన్‌ బ్యాండ్ ప్రదర్శనలు ఇస్తుందని బిపిన్ రావత్ వివరించారు.

ఇక కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో ఆర్మీ ఎలాంటి సమస్యలను ఎదుర్కోవట్లేదని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నవరనే అన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన మొదటి ఆర్మీ వ్యక్తి కోలుకున్నాడని, విధుల్లో కూడా చేరిపోయాడని వివరించారు. ఆర్మీ మొత్తంలో కేవలం 14 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని.. ఇందులో ఐదుగురు కోలుకుని విధుల్లో చేరిపోయారని చెప్పారు. కాగా బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత త్రివిధ దళపతులతో కలిసి మీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.

Read This Story Also: మహేష్‌, బన్నీ, ప్రభాస్‌లకు అమ్మగా నటించేందుకు నేను రెడీ: రేణు