సాధారణ తనిఖీలు.. కారు ఆపి చెక్ చేసిన పోలీసులు.. అందులో కనిపించినవి చూడగా

|

Aug 07, 2024 | 7:33 AM

దేశ వ్యాప్తంగా ఫేక్ కరెన్సీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో భారీ మొత్తంలో దొంగనోట్లు స్వాధీనం చేసుకోగా.. ఇప్పుడు తమిళనాడులో 80లక్షల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు.

సాధారణ తనిఖీలు.. కారు ఆపి చెక్ చేసిన పోలీసులు.. అందులో కనిపించినవి చూడగా
Follow us on

తమిళనాడులో భారీగా దొంగ నోట్లు కలకలం రేపాయి. తిరునల్వేలి జిల్లా నాంగునేరిలో భారీగా ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు. నాగర్కోవిల్ తిరునల్వేలి హైవేఫై వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా.. ఫేక్ కరెన్సీ వ్యవహారం బయటపడింది. నాగర్కోవిల్ నుంచి వస్తున్న వాహనంలో నగదును గుర్తించారు పోలీసులు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడం విచారణ చేశారు పోలీసులు. పోలీసులు విచారణలో దొంగనోట్ల వ్యవహారం బట్టబయలైంది. 80 లక్షలు విలువైన దొంగనోట్లు, ఫేక్ కరెన్సీ ముద్రణకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

కేరళ నుంచి తమిళనాడుకి దొంగ నోట్ల రవాణా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈమధ్య కాలంలో ఫేక్ కరెన్సీ కేసులు దేశ వ్యాప్తంగా నమోదువుతున్నాయి. రీసెంట్‌ గా ఏపీలోని ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీని ముఠా గుట్టురట్టైంది. పది లక్షలు ఇస్తే 44 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఏలూరుకు చెందిన ఓవ్యక్తిని బురిడి కొట్టించారు. అడ్వాన్స్‌గా అతని వద్దనుంచి 3లక్షల రూపాయాలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో నకిలీ ముఠా నుంచి 47 లక్షల ఫేక్‌ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఫేక్‌ కరెన్సీ కలకలం రేపింది.

నకిలీ నోట్ల చెలామణిలో మాజీ బ్యాంక్ మేనేజర్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మేనేజర్ జగదీష్‌కి చెందిన బాచుపల్లి నివాసంలో 7.5లక్షల విలువైన దొంగనోట్లు సీజన్ చేశారు. తాజాగా కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దండేలీలో జరిపిన సోదాల్లో 72 లక్షల రూపాయల దొంగ నోట్లు సీజ్ చేశారు. ఇటీవల ఫేక్ 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది ఆర్‌బిఐ. 5వందల ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి