Kalam Death Anniversary: నీ స్మృతిలో.. నేడు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం 7వ వర్ధంతి.. యావత్ భారతం వందనం

|

Jul 27, 2022 | 11:09 AM

పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన కలాం జీవితం ఎందరికో స్పూర్తివంతం. డాక్టర్ APJ అబ్దుల్ కలాం 7వ వర్ధంతి సందర్భంగా.. ఆయన యువతకు అందించిన కొన్ని ఉత్తేజకరమైన కోట్స్ ను తెలుసుకుందాం.. 

Kalam Death Anniversary: నీ స్మృతిలో.. నేడు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం 7వ వర్ధంతి.. యావత్ భారతం వందనం
Apj Abdul Kalam Death Anniv
Follow us on

Abdul Kalam Death Anniversary: కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు యువతకు నిచ్చిన ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అబ్ధుల్ కలాం వర్ధంతి నేడు. అబ్దుల్ కలాం మన దేశ గొప్ప శాస్త్ర వేత్తల్లో ఒకరు. 1931, అక్టోబర్ 15 న తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన అషియమ్మ జైనుల్లాబ్దీన్, జైనుల్లాబ్దీన్ మరకయార్ దంపతులకు జన్మించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అద్బుల్ కలాం.. 2015 జూలై 26  షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన చికిత్స తీసుకుంటూనే మర్నాడు జూలై 27 న కలాం తన 84 ఏట మృతి చెందారు. 1958 లో మద్రాస్ మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టాను తీసుకున్న ఆయన 1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు. భారతరత్న సహా ఎన్నో అవార్డులు, పురష్కారాలు కలాం ను వరించాయి. ఖురాన్‌తో పాటు, భగవద్గీత‌ను చదివే కలాం మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు.. పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన కలాం జీవితం ఎందరికో స్పూర్తివంతం. డాక్టర్ APJ అబ్దుల్ కలాం 7వ వర్ధంతి సందర్భంగా.. ఆయన యువతకు అందించిన కొన్ని ఉత్తేజకరమైన కోట్స్ ను తెలుసుకుందాం..

  1. *”కలలు, కలలు, కలలు. కలలు ఆలోచనలుగా రూపాంతరం చెందుతాయి. ఆలోచనలకు దారితీస్తాయి.”
  2. *”యువత ఎటువంటి విషయంలోనూ రాజీని పడకూడదు.. లేదా తాము ఎంచుకున్న లక్ష్యం నుంచి దృష్టిని మరల్చవద్దు. యువతను నిర్వీర్యం చేసే సిద్ధాంతాలను అమలు చేసే సమాజం ఎప్పటికీ ముందుకు వెళ్ళదు.
  3. *”నిశ్చయం.. మన నిరాశ, అడ్డంకుల నుండి బయటపడేసే శక్తి. విజయానికి ఆధారమైన మన సంకల్ప శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.”
  4. *”మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోవద్దు. రెండవసారి విఫలమైతే.. మీ సక్సెస్ కేవలం అదృష్టతోనే వచ్చిందని ఎద్దేవా చేయడానికి చాలా పెదవులు ఎదురుచూస్తూ ఉంటాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. “మన పిల్లలు రేపటి భవిష్యత్ కోసం మన నేటిని త్యాగం చేద్దాం.”
  7. “విజయం సాధించాలనే  సంకల్పం తగినంత బలంగా ఉంటే వైఫల్యం నిన్ను ఎప్పటికీ అధిగమించదు.”
  8. “మీరు విఫలమైతే..  ఎప్పుడూ దానిని వదులవద్దు.. ఎందుకంటే విఫలం..  విజయానికి మొదటి మెట్టు
  9. “మీరు విజయం సాధించాలంటే, మీ లక్ష్యం పట్ల ఏకాగ్రతతో మనసు పెట్టి పనిచేయాల్సి ఉంటుంది.
  10. “దేశంలోని అత్యుత్తమ తెలివైన వారిని తరగతి గదిలోని చివరి బెంచీలలో చూడవచ్చు.”
  11. “చురుకుగా ఉండండి! బాధ్యత వహించండి! మీరు విశ్వసించే వాటి కోసం పని చేయండి. మీరు చేయకపోతే.,. మీరు చేయాల్సిన పనిని విధిని మరొకరికి అప్పగించినట్లే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..