Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌పై ఏపీ సీఎం, మంత్రి లోకేశ్‌ స్పందన..! ఏమన్నారంటే..

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేసింది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ పై ఎక్స్ వేధికగా చేసిన పోస్ట్ కు చంద్రబాబు స్పందిస్తూ..

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌పై ఏపీ సీఎం, మంత్రి లోకేశ్‌ స్పందన..! ఏమన్నారంటే..
Chandrababu

Updated on: May 07, 2025 | 9:50 AM

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేసింది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ పై ఎక్స్ వేధికగా చేసిన పోస్ట్ కు చంద్రబాబు స్పందిస్తూ.. ‘జైహింద్’ అంటూ రిప్లై ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ సైతం ‘జైహింద్… న్యాయం జరిగింది’ అంటూ ట్విట్‌ చేశారు. భారత సైన్యం చర్యలను అభినందించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

అటు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా స్పందించారు.  జీరో టోలరెన్స్ ఫర్ టెర్రరిజం.. భారత్ మాతాకీ జై అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ట్వీట్ చేశారు.

 

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో దాడి చేసిన భారత్ ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుట్టించింది. భారత సైన్యం బాంబులతో పాక్‌పై విరుచుకుపడింది. పాకిస్థాన్‌ అమెరికా దగ్గరకు పరుగులు పెట్టేలా చేసింది. దీంతో ప్రజల్లో ఇండియా- పాక్‌ మధ్య వార్‌ జరుగుతుందనే ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఎక్స్‌లో #IndiaPakistanWar అని టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఆ తరువాత #OperationSindooor అనేది ట్రెండింగ్‌లో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..