Anurag Thakur: భారత్ స్థాయి మరింత పెరిగింది.. నావికాదళ అధికారుల విడుదలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..

భారత్ - ఖతార్‌ మధ్య దౌత్యం సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయి. గతేడాది మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారత నౌకాదళ అధికారులను ఖతార్‌ సోమవారం విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా వేసిన ఉరిశిక్షను రద్దు చేసి ఖతార్ ప్రభుత్వం జైలు శిక్షగా మార్చింది.

Anurag Thakur: భారత్ స్థాయి మరింత పెరిగింది.. నావికాదళ అధికారుల విడుదలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
Anurag Thakur

Updated on: Feb 12, 2024 | 7:02 PM

భారత్ – ఖతార్‌ మధ్య దౌత్యం సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయి. గతేడాది మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారత నౌకాదళ అధికారులను ఖతార్‌ సోమవారం విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా వేసిన ఉరిశిక్షను రద్దు చేసి ఖతార్ ప్రభుత్వం జైలు శిక్షగా మార్చింది. ఖతార్‎లో బందీలైన నావికాదళ అధికారులను విడిపించాలని నౌకాదళ కుటుంబసభ్యులు విదేశీ మంత్రిత్వ శాఖను కోరగా.. కేంద్రం ఖతార్ తో సంప్రదింపులు జరిపింది. దీంతో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులను ఖాతార్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, వీరంతా 18 నెలలుగా వీరు అక్కడి జైల్లో ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి విముక్తి కల్పిస్తూ ఖతార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడుగురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఖతార్‌ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తూ.. మంచి పరిణామమని పేర్కొంది.

అయితే, ఖతార్ నుంచి ఎనిమిది మంది భారతీయ నావికాదళ అధికారుల విడుదలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. సోమవారం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘45 రోజుల క్రితం, వారి మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా తగ్గించారు.. ఇప్పుడు, మన నేవీ అనుభవజ్ఞులను స్వదేశానికి తీసుకురావడం ద్వారా, అది రుజువు చేయబడింది. మోడీ ప్రభుత్వంలో ప్రతి ప్రాణం ముఖ్యం. అందుకే ఆపరేషన్ గంగాలో దాదాపు 27000 మంది భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుండి తరలించారు. నేపాల్ లేదా ఆఫ్ఘనిస్తాన్ .. ఇలా ఏదైనా యుద్ధంలో లేదా విపత్తు సంభవించిన ఏ దేశం నుంచి అయినా భారత ప్రభుత్వం వారిని సురక్షితంగా తీసుకువస్తోంది. గత 10 సంవత్సరాలలో ఏమి జరిగిందో అంతా గమనిస్తున్నారు.. ప్రపంచంలో భారతదేశం స్థాయి మరింత పెరిగింది…” అంటూ పేర్కొన్నారు.

అనురాగ్ ఠాకూర్ ఏమన్నారంటే..

ఎనిమిది మంది భారతీయ నావికాదళ సిబ్బంది.. అక్టోబర్ 2022 నుండి ఖతార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జలాంతర్గత వ్యవహారాల్లో గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రిటైర్డ్ నావికా సిబ్బందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం దౌత్యంతో మరణశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించింది.. ఈ క్రమంలోనే గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దుబాయ్‌లో COP28 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన క్రమంలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యం పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత ఖతార్ ప్రభుత్వం వారిని విడుదల చేయడంతో.. ఢిల్లీకి చేరుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ కల్ిక్ చేయండి..