ఆ నిరసనకారులకు పాక్‌తో సంబంధాలు..? షాకింగ్ న్యూస్ చెప్పిన చెన్నై పోలీసులు..

| Edited By:

Jan 03, 2020 | 1:35 AM

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తున విషయం తెలిసిందే. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిరసనలు తెల్పుతున్నారు. యూపీ, వెస్ట్ బెంగాల్, అసోం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశ రాజధానిలో న్యూ ఇయర్ వేళ కూడా జాతీయ గీతం పాడుతూ వారి నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులో వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. రహదారులపై ఇళ్ల ముంగిట […]

ఆ నిరసనకారులకు పాక్‌తో సంబంధాలు..? షాకింగ్ న్యూస్ చెప్పిన చెన్నై పోలీసులు..
Follow us on

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తున విషయం తెలిసిందే. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిరసనలు తెల్పుతున్నారు. యూపీ, వెస్ట్ బెంగాల్, అసోం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశ రాజధానిలో న్యూ ఇయర్ వేళ కూడా జాతీయ గీతం పాడుతూ వారి నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులో వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. రహదారులపై ఇళ్ల ముంగిట పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ముగ్గుళు వేశారు. ఆ ముగ్గుళపై ఎన్నార్సీ, సీఏఏ వద్దు అంటూ అర్ధం వచ్చేలా రాశారు. ఆ తర్వాత అనుమతి లేకుండా రోడ్లపై నిరసనలు తెలిపారంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిరసనలు చేపట్టిన వారి వివరాలు తీసుకున్న పోలీసులు.. వారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ నిరసన కారుల్లో ఒకరికి పాకిస్థాన్‌కు చెందిన పలు సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు చెన్నై పోలీసులు తెలిపారు. పాకిస్థాన్‌ మానవ హక్కుల సంస్థతో ఒకరికి సంబంధాలు ఉన్నాయని.. బసంత్‌నగర్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ మహిళను అరెస్టు చేసి, దర్యాప్తు చేసినపుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

చెన్నై నగర పోలీస్ కమిషనర్ తెలిపిన ప్రకారం.. నిరసనకారుల్లో ఒక మహిళకు పాక్‌లోని మానవ హక్కుల సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. దీనిని ధృవీకరించేందుకు మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను పరిశీలించినపుడు ఈ విషయం స్పష్టత వచ్చిందన్నారు. మానవ హక్కుల సంఘం కోసం పని చేస్తున్నట్లు ఆమె.. ఫేస్‌బుక్‌లో పేర్కొన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన చాలా నిరసన కార్యక్రమాలతో పాటు.. ముగ్గులు వేసి నిర్వహించిన నిరసనలతో కూడా సంబంధం ఉందని చెప్పారు.