చెన్నై స్కూల్లో టీచర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు,…..మరో టీచర్ ని అరెస్టు చేసిన పోలీసులు

చెన్నైలోని ఓ ప్రముఖ స్కూల్లో తనను టీచర్లు లైంగికంగా వేధించారంటూ మాజీ విద్యార్థిని ఒకరు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని మరో టీచర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నై స్కూల్లో టీచర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు,.....మరో టీచర్ ని అరెస్టు చేసిన పోలీసులు
Sexual Harassment

Edited By:

Updated on: Jun 09, 2021 | 1:54 PM

చెన్నైలోని ఓ ప్రముఖ స్కూల్లో తనను టీచర్లు లైంగికంగా వేధించారంటూ మాజీ విద్యార్థిని ఒకరు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని మరో టీచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 2014 నుంచి 2016 వరకు తానీ పాఠశాలలో చదివినప్పుడు తనను ఇలా వేధించారని ఆ విద్యార్థిని పేర్కొంది. ఈ ఫిర్యాదుపై కిల్పాక్ లోని మహిళా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కామర్స్ పాఠాలు చెప్పే టీచర్ ని అరెస్టు చేశారు. ఈ స్కూలుకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని ఇటీవలే అదుపులోకి తీసుకున్న విషయం గమనార్హం. తాను ప్రస్తుత , మాజీ విద్యార్థినులను ఎలా హరాస్ చేసేవాడో ఇతగాడు పోలీసుల విచారణలో చెప్పాడు. టవల్ కప్పుకుని ఆన్ లైన్ పాఠాలు చెబుతూ వారికీ అసభ్యకరమైన ఫోటోలు పంపేవాడినని అంగీకరించాడు. కొన్ని వారాలుగా ఈ నగరంలోని కనీసం 5 స్కూళ్లకు చెందిన టీచర్లపై ఈ విధమైన ఆరోపణలు రావడంతో వారిని అరెస్టు చేయడమో.. సస్పెండ్ చేయడమో జరిగింది. ఏమైనా ఈ విధమైన ఘటనలు ప్రభుత్వ దృష్టికి రావడంతో… ఆన్ లైన్ తరగతుల టీచింగ్ ని రెగ్యులేట్ చేయాలని, ఇలాంటివి జరగకుండా చూడాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు.

పేరు పొందిన పాఠశాలల్లోనే ఇలాంటి ఉదంతాలు జరగడం అటు విద్యార్థుల తలిదండ్రులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆన్ లైన్ క్లాసుల తీరు వారిని కలవరపరుస్తోంది. ఉపాధ్యాయులు కొందరు ఈ క్లాసుల సందర్బంగా అసభ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్లాసులు జరుగుతున్నప్పుడు పేరెంట్స్ కూడా తమ పిల్లల వద్దే ఉండాలని, ఈ క్లాసుల తీరును గమనిస్తుండాలని పలువురు సూచిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Punjab Politics: ఎన్నికలకు ఏడాది ముందుగా..పంజాబ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు..దళిత ఓట్లు లక్ష్యంగా కొత్త కూటమి!

Corona Virus: కరోనా వైరస్‌ పుట్టింది ముమ్మాటికి చైనాలోనే!