CM Ys Jagan Delhi Tour: ఢిల్లీ టూర్‌లో ఏపీ సీఎం జగన్‌ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీలు

|

Jun 11, 2021 | 8:00 AM

CM Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. గురువారం కేంద్ర మంత్రి ప్రకావ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి..

CM Ys Jagan Delhi Tour: ఢిల్లీ టూర్‌లో ఏపీ సీఎం జగన్‌ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీలు
Follow us on

CM Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. గురువారం కేంద్ర మంత్రి ప్రకావ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌తో సమావేశమైన సీఎం జగన్‌.. పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని జగన్‌ వివరించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిల అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి షేకావత్‌తో సీఎం జగన్‌ దాదాపు 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ భేటీలలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అయితే పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాల్సి అంశాన్ని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ముందు ప్రస్తావించారు. కాగా, రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని సీఎం జగన్‌ కోరినట్లు తెలుస్తోంది. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ, పునరావాస పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటర్‌ సరఫరాను కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నామని, జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్‌ చేయాలని కోరారు. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయవద్దన్న, 2013 రైట్‌ టు ఫెయిర్‌ కాంపన్‌సేషన్, ట్రాన్స్‌పరెంటీ ఇన్‌ ల్యాండ్‌ అక్విజిషన్, రీహేబ్‌లిటేషన్‌ అండ్‌ రీ సెటిల్‌మెంట్‌ చట్టం ప్రకారం పునరావాస పనులకు రీయింబర్స్‌ చేయాలని సీఎం జగన్‌ కోరారు.

అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరంకు తరలించాలని కోరిన సీఎం.. హైదరాబాద్‌లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవని, ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలన కోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి రావడం కష్టం అవుతోందని, అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలని కోరినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి.. పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్‌ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే ఈ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ను ముఖ్యమంత్రి​ కలవనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి శుక్రవారం తాడేపల్లి చేరుకుంటారు.

ఇవీ కూాడా చదవండి:

Weather Report: రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

Botsa : టీడీపీకి నీచమైన ఆలోచనలు తప్ప..సూచనలు ఇచ్చే అలవాటు లేదు, అందు కోసమే సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన : బొత్స