అందమైన మయూరానికి ఆహారం.. ఆ మహిళదే ఔదార్యం… ఆకట్టుకుంటున్న వీడియో

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా విడుదల చేసే ఎన్నో అద్భుతమైన వీడియోల్లో ఇదీ ఒకటి.. ఒక్కోసారి మానవత్వాన్ని స్పృశించేట్టుగా , మరోసారి ఫన్నీగా, ఇంకోసారి ఆలోచింపజేసేవిగా ఉంటాయి అవి..

అందమైన మయూరానికి ఆహారం.. ఆ మహిళదే ఔదార్యం... ఆకట్టుకుంటున్న వీడియో
Woman Feeding Peacock

Edited By: Phani CH

Updated on: Aug 12, 2021 | 7:44 PM

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా విడుదల చేసే ఎన్నో అద్భుతమైన వీడియోల్లో ఇదీ ఒకటి.. ఒక్కోసారి మానవత్వాన్ని స్పృశించేట్టుగా , మరోసారి ఫన్నీగా, ఇంకోసారి ఆలోచింపజేసేవిగా ఉంటాయి అవి. అలాంటిదే మరొకటి.. కూరగాయలు అమ్ముకుంటున్న ఓ మహిళ ఓ నెమలికి ఆహారం అందిస్తున్న ఈ వీడియో పాతదే అయినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇది మీ హృదయాలను తప్పకుండా తాకుతుంది అంటున్నారు ఆనంద్ మహీంద్రా.. మానవతా వాదం..ఈ మన భూగ్రహం.. రెండూ కలిసే ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. 56 సెకండ్ల ఈ వీడియోలో ఈ మహిళ తన చేతిలో యేవో గింజలను పట్టుకుని ఆ నెమలికి ఆప్యాయంగా తినిపిస్తూ కనిపిస్తుంది. ఇది 1.5 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది..28 వేల లైక్స్ వచ్చాయి. రీట్వీట్లకైతే లెక్కే లేదు.

జాతీయ మయూరానికి మదర్ ఇండియా ఆహారం తినిపిస్తోంది అని ఓ ]నెటిజెన్ అంటే.. అద్భుతమైన దృశ్యం అని మరో నెటిజనుడు వ్యాఖ్యానించాడు. బహుశా ఇది రాజస్థాన్ రాష్ట్రం లోనిది అయి ఉండవచ్చు ఆ ఇంకొకరు పేర్కొన్నారు. ఏమైనా దీన్ని ప్రశంసించని వాళ్ళు లేరు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ‘మొసలి కన్నీరు కార్చకండి.. దేశానికి క్షమాపణ చెప్పండి.’ విపక్షాలకు కేంద్రం డిమాండ్

Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు.. తాజాగా వైరల్‌గా మారిన తల్లితో జిమ్‌కు కలిసి వెళ్తున్న ఫోటోలు..